ETV Bharat / state

ఈ చీకట్లు తొలగితేనే అసలైన దీపావళి - వాటిపై విజయం సాధిస్తేనే జీవితంలో వెలుగులు

సామాజిక రుగ్మతలపై విజయం సాధిస్తేనే వెలుగులు - చీకటి నింపుతున్న పలు ప్రమాదకర ధోరణులపై పోరాటం ఆవశ్యకతను వివరిస్తూ దీపావళి నేపథ్యంలో ‘ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం

Special Article on Social Ills of Palamuru
Special Article on Social Ills of Palamuru (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2024, 5:00 PM IST

Special Article on Social Ills of Palamuru : చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా, చీకట్లు తొలగి వెలుగు నింపే పండుగగా దీపావళిని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. ఇంటింటా దీపాలు వరుసగా వెలిగించి పూజలు చేస్తాం. ఉత్సాహంగా టపాకాయలు కాలుస్తాం. బాణాసంచా పేలుస్తాం. ఇదే స్ఫూర్తితో పాలమూరును కారు చీకటిలా కమ్మేస్తున్న పలు సమస్యలను రూపుమాపాలి. ఇందుకు అధికారులతో పాటు అన్ని వర్గాలు సమైక్యంగా ముందుకు కదలాలి. పాలమూరు కొంత ప్రగతి సాధించినా రేపటితరమైన బాలలు, యువత ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉన్నారు. బాలలు చిన్న చిన్న పనుల్లో మగ్గిపోతున్నారు. 16 ఏళ్లయినా నిండకుండానే ఆడబిడ్డలు పెళ్లి కూతుళ్లవుతున్నారు. యువత డ్రింకింగ్, బెట్టింగ్‌, మాదక ద్రవ్యాల బారినపడి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చీకటి నింపుతున్న ఈ ప్రమాదకర ధోరణులపై పోరాటం ఆవశ్యకతను వివరిస్తూ దీపావళి నేపథ్యంలో ‘ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం.

మద్యం మత్తు వదలాలి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మద్యపానం పెరిగిపోతోంది. అత్యధిక రోడ్డు యాక్సిడెంట్లు, మరణాలకు మద్యమే కారణమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా 10వేలకు పైగా డ్రంక్‌ అండ్‌ డ్పైవ్ కేసులు నమోదవుతున్నాయంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్ఛు ప్రతి పల్లెలో బెల్టుషాపులు, కిరాణ షాపుల్లోనూ మద్యం అమ్ముతున్నారు. మద్యం బాటిళ్లు అమ్మకానికి వేలంపాటలు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలో నాటుసారా, కల్తీ కల్లు సైతం ఏరులై పారుతున్నాయి. కల్తీ కల్లుకు బానిసలైన వాళ్లు అనేక జబ్బుల బారినపడటంతో పాటు మానసిక స్థితి కంప్లీట్​గా దెబ్బతిని ఏ పనీ చేయలేకపోతున్నారు. తాగిన మత్తులో సూసైడ్స్, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చెకింగ్​లు విస్తృతం చేయటంతో పాటు పల్లెల్లో బెల్టుషాపులు, నాటుసారా విక్రయాలు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలి. కల్తీ కల్లును గవర్నమెంట్ అరికట్టాలి. కల్తీకల్లు అనర్థాలపై కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు పూర్తైన అవగాహన కల్పించాలి.

గంజాయితో వినాశనమే

పట్టణాలు, పల్లెల్లోనూ గంజాయి మత్తు గుప్పుమంటోంది. హైదరాబాద్‌లో దూల్‌పేట్‌ నుంచి ఈ మత్తుపదార్థం తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, డిగ్రీ స్టూడెంట్స్​తో పాటు ఆటో డ్రైవర్లు, న్యాయవాదులు, వైద్యులు.. ఇలా చాలా వర్గాలు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు గంజాయి మత్తులో స్నేహితుడినే కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఈనెల 3న ఏనుగొండలోని మహబూబ్‌నగర్‌ హైవే కూడలిలో గంజాయి నూనె తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డారు. ముఖ్యంగా నేషనల్ హైవే వెంట గంజాయి దందా ఎక్కువైంది. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 15 గంజాయి కేసులు నమోదయ్యాయి. కావేరమ్మపేటకు ఇద్దరు అన్నదమ్ములు డ్రగ్స్‌, ఆల్కహాల్​కు బానిసయ్యారు. మత్తులో ఒకరు నీటిలో పడిపోయి, మరొకరు రోడ్డు యాక్సిడెంట్​లో మృతిచెందారు. వారి కుటుంబం వీధినపడింది.

ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌

ఈజీగా, వేగంగా డబ్బు సంపాదించాలని జూదం, మట్కా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లోకి దిగుతున్న యువత ఆ ఊబిలోనే పూర్తిగా కూరుకుపోతున్నారు. రూ.లక్షల్లో అప్పులు చేసి పేకాట ఆడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్తకోట, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులు బెట్టింగ్‌తో నష్టపోయి సూసైడ్​కు పాల్పడ్డారు. జడ్చర్లకు చెందిన ఓ మర్చంట్​ కుమారుడు బెట్టింగ్‌లతో భారీగా అప్పులు చేయటంతో కుటుంబం పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఏటా నిర్వహించే ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్​ల సమయంలో బెట్టింగ్‌ ఎక్కువగా జరుగుతోంది. అలాగే వివిధ మోసపూరిత యాప్స్‌, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్​మెంట్​ చేసి నష్టపోయిన వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం)తోనూ చాలామంది యువతీ యువకులు భారీగా మోసపోతున్నారు. వీటిపై పోలీసు శాఖ, విద్యాసంస్థలు, వాలంటరీ వ్యవస్థలు ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముంది.

పనుల్లో మగ్గుతున్న బాల్యం

పాలమూరులో చిన్నారుల స్థితిగతులు ఏమాత్రం మారటం లేదు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన బాలలు బాలకార్మికులుగా పని భారం మోస్తున్నారు. వారి ఫ్యూచర్ అంధకారంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో 6-14 ఏళ్లలోపు బాలురు 821 మంది, గర్ల్స్​ 806 మంది మొత్తం 1,627 మంది బడిబయట ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి దానికి పదుల రెట్లు బాలలు పనుల్లో ఉన్నారన్నది వాస్తవం. బాలబాలికల జనాభాలో 11 శాతం మంది బాల కార్మికులుగా ఉన్నట్లు సర్వేలు సైతం వివరిస్తున్నాయి. ఇటీవల గద్వాల జిల్లాలో ఓ బాలిక తాను పనిచేస్తున్న ఇంటి యజమాని చేయని దొంగతనం మోపారన్న అవమాన భారంతో సూసైడ్​కు పాల్పడిన ఘటన అందరినీ కలచివేసింది. ఉమ్మడి జిల్లాలో బాలల దైన్యానికి ఇదే ప్రధాన నిదర్శనం. చాలా ప్రాంతాల్లో పిల్లలు ఏటా కొన్ని నెలల పాటు స్కూల్​కు దూరమై పత్తిచేలల్లో కూలీలుగా మారుతున్నారు. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్తున్న పేరెంట్స్​ తమ పిల్లలను ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, వ్యవసాయంలో పనివాళ్లుగా పెడుతున్నారు. ఇలాంటి వారిని ఐడెంటిఫై చేసి ప్రత్యేక పాఠశాలల్లో చదివించాలి. పిల్లలను పనిలో పెట్టుకుంటున్న వారిపై కార్మికశాఖ, పోలీసు శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ మొక్కుబడి సర్వేతో సరిపెట్టకుండా బడిబయటి పిల్లలందరినీ గుర్తించి బడిబాట పట్టించాలి.

పుత్తడి బొమ్మలుగా..

ఉమ్మడి జిల్లాలో బాలికలను బాల్య వివాహాలు తీవ్రంగా బలి చేస్తున్నాయి. వారి జీవితాలను అంధకారంలోకి నెట్టుతున్నాయి. 2023 ఏడాదికిగానూ 245 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఇవి కేవలం ఫిర్యాదు అందినవి మాత్రమే. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన చైల్డ్ మ్యారేజ్​లు వేలల్లో ఉంటాయి. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో బాల్య వివాహాలు అధికంగా వెలుగుచూస్తున్నాయి. బాల్య వివాహాలతో చదువుకు దూరం కావటంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. చిన్న ఏజ్​లో పెద్ద బాధ్యతలు, వేధింపులు, పనిభారంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోతున్నారు. అలాగే బాలికలపై సెక్సువల్​ వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. యువకులు, పెళ్లయిన వాళ్లు కూడా మాయమాటలు చెప్పి బాలికలను కిడ్నాప్​ చేస్తూ, అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో నమోదవుతున్న పోక్సో కేసులే ఇందుకు సాక్ష్యం. బాల్య వివాహాలు, బాలికలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై పోలీసు యంత్రాంగం, స్త్రీశిశు సంక్షేమ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలి. చైల్డ్‌లైన్‌-1098, బాలల హక్కులపై ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్​లలో విస్తృతంగా చైతన్యం చేయాలి.

ఆ ఊళ్లో 70 ఏళ్లుగా దీపావళి జరుపుకోరు - ఎందుకో తెలుసా?

దీపావళి ఆఫర్ల పేరుతో మీ ఫోన్లకు ఇలాంటి మెసేజ్​లు వస్తున్నాయా? - తస్మాత్ జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.