ETV Bharat / state

హైదరాబాద్‌ తాగునీటికి మూడు ప్రత్యామ్నాయాలు - ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం

హైదరాబాద్ తాగునీటిపై సర్కార్‌ ఫోకస్ - కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, సంగారెడ్డి కాలువ నుంచి నీటి మళ్లింపుపై ప్రతిపాదనలు

Special Story on All Water Resources to Hyderabad
Special Story on All Water Resources to Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Special Story on All Water Resources to Hyderabad : హైదరాబాద్‌ మహానగర తాగునీటి అవసరాలతో పాటు మూసీ పునరుజ్జీవంలో భాగంగా హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు గోదావరి నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మూడు ప్రత్యామ్నాయాలపై పనులు మొదలుపెట్టింది. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా తాగనీరు సరఫరా చేయగలగడం, భూసేకరణ తక్కువగా ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది.

కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌, సంగారెడ్డి కాలువ నుంచి రావల్‌కోడ్‌ వద్ద నీటిని మళ్లించే ప్రదిపాదనలపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఈ అంశంపై పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం జరిగింది. మూడు ప్రతిపాదనలను పరిశీలించి వాటిలో ఏది మెరుగైంది తదితర అంశాలపై అధ్యయనం చేసి తుది నిర్ణయానికి రావాలని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు శాఖలు సంయుక్తంగా పని చేస్తున్నాయి. గోదావరి నుంచి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కేటాయింపుగా ఉండగా, మొదటి దశలో ఎల్లంపల్లి నుంచి పది టీఎంసీలు నీటిని తీసుకుంటున్నారు. రెండో దశ కింద హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, మూసీ పునరుజ్జీవం కోసం 5 టీఎంసీలు కలిపి 15 టీఎంసీలు తీసుకోవాలని తెలిపారు. తాజాగా 20 టీఎంసీలను మళ్లించాలని యోచిస్తున్నారు.

తాగునీటికి మాత్రమే ఉపయోగపడుతుంది : కొండపోచమ్మసాగర్‌ నుంచి నీటిని తీసుకుంటే మల్లన్నసాగర్‌ నుంచి తీసుకొనే దానికి సంవత్సరాని అయ్యే నిర్వహణ ఖర్చు కన్నా రూ.50 కోట్లు ఎక్కువ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మల్లన్నసాగర్‌ సామర్థ్యం ఎక్కువ కావడం, డెడ్‌ స్టోరేజీలోనే ఐదు టీఎంసీలు అందుబాటులో ఉండటం, ఈ నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించడానికి వీలవుతుంది అందుకు ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. అయితే మూడు ప్రతిపాదనలను బేరీజు వేసి నిర్ణయానికి రానున్నట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.

కాళేళ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ నుంచి పది టీఎంసీలను హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను మళ్లించేందుకు 2017 అక్టోబరు 24న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేశవాపురం వద్ద పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించడం, కొండపోచమ్మసాగర్‌ నుంచి కేశవాపురానికి ఐదు టీఎంసీలు, నేరుగా ఘనపూర్‌ వద్ద మరో ఐదు టీఎంసీలు మళ్లించడం, రెండు నీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం.

భూసేకరణ ముఖ్యం : ఈ పని విలువను 4,777.59 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా, ఈ పనిని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది. దీని ప్రకారం పదేళ్లలో చెల్లించాల్సిన మొత్తం 7,212.78 కోట్ల రూపాయలుగా ఉత్తర్వులో పేర్కొంది. ఇందులో అంచనా ఖర్చులో 20 శాతం, భూసేకరణ వ్యయం కలిపి ప్రభుత్వ వాటా రూ.1,260.67 కోట్లు అవ్వగా, నిర్మాణం చేపట్టే సంస్థ మిగిలిన 80 శాతం కింద రూ.3,516.92 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టెండర్లలో అంచనాపై 3.45 శాతం ఎక్కువ కోట్‌ చేసి ఎల్‌-1గా నిలిచిన ఎంఇఐఎల్కు ఈ నిర్వహణ పనిని అప్పగిస్తూ 2018 ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై 8న అప్పటి సీఎం వద్ద జరిగిన సమావేశంలో భూసేకరణ సమస్యను పరిగణనలోకి తీసుకొని 5 టీఎంసీల సామర్థ్యంతో కేశవాపురం రిజర్వాయర్‌ నిర్మించాలని, ప్రభుత్వ, అటవీ భూమిలో 5.04 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను రూ.3,363.37 కోట్లతో నిర్మించడంతోపాటు కొండపోచమ్మ నుంచి ఘనపూర్‌కు పది టీఎంసీల మళ్లింపు పనిని ఎం.ఇ.ఐ.ఎల్‌కు కట్టుబెట్టింది.

హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు ఆటంకం లేదు - సుంకిశాల ప్రాజెక్ట్​ ఘటనపై జలమండలి - Sunkishala Project Wall Collapse

ఈ పనిని అప్పటికే చేస్తున్న సంస్థకు అప్పగించడానికి నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. అయితే భూసేకరణ సమస్య వల్ల రిజర్వాయర్‌ నిర్మాణం, ఇతర పనులు మొదలు పెట్టలేదు. అందువల్ల తాజా ఎస్సేసార్‌ ప్రకారం 1,050 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ తెలపడంతో ప్రస్తుత గవర్నమెంట్‌ ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ పని చేపట్టాలంటే 1,615 ఎకరాల భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ పథకం ఘనపూర్‌ వరకే ఉన్నందువల్ల మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమయత్‌సాగర్‌లకు మళ్లించడానికి అయ్యే ఖర్చు అదనపు భారం.

కొండపోచమ్మసాగర్‌ నుంచి 5 దశల్లో ఎత్తిపోతల ఉందని, నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందని నీటిపారుదల శాఖ ఎత్తిపోతల సలహాదారు తెలిపినట్లు సమాచారం. తాజాగా దీన్ని రూ.5,869.22 కోట్లుగా అంచనా వేశారు. దీంతో పాటు ఘనపూర్‌ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు, ఉస్మాన్‌సాగర్‌ నుంచి హిమాయత్‌సాగర్‌కు పైపులైన్‌ వేసి నీటిని మళ్లించాల్సి అవసరం ఉంటుంది. అయితే గతంలో ఇచ్చినట్లుగా యాన్యుటీ పద్ధతిని పక్కనపెట్టి రెగ్యులర్‌ టెండర్‌ ప్రకారం అప్పగించినా 5,495 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం.

నిర్వహణ వ్యయం తగ్గుతుంది : మల్లన్నసాగర్‌ సామర్థ్యం 50 టీఎంసీలు కావడంతో పాటు డెడ్‌ స్టోరేజీ నుంచి కూడా తాగునీటి అవసరాలకు తీసుకొనే వెసులుబాటు ఉంది. దీంతో సంవత్సరం పొడవునా ఎలాంటి సమస్య ఉండదని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో రెండు దశల్లో ఎత్తిపోతలు ఉన్నందువల్ల కొండపోచమ్మసాగర్‌ కంటే ఏడాది నిర్వహణ వ్యయం రూ.50 కోట్ల వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు.

సంగారెడ్డి కాలువ 27వ కి.మీ వద్ద నుంచి 15 టీఎంసీల నీటిని మళ్లించడం, రావల్‌కోల్‌ వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించడం, ఇక్కడి నుంచి ఘన్‌పూర్‌కు, తర్వాత హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు మళ్లించే ప్రతిపాదనను కూడా తాజాగా నీటిపారుదల, పురపాలక శాఖలు పరిశీలించాయి. ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో ఈఎన్సీ అనిల్‌ కుమార్‌ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం.

ఈ పనికి సుమారు రూ.5వేల కోట్ల వ్యయం అయ్యే అవకాశముంది. అయితే తూముల, సంగారెడ్డి కాలువ నిర్వహణ సమస్యగా మారే అవకాశం ఉండటంతో పాటు తీసుకొన్న నీటిలో 40 శాతానికి మించి తాగునీటికి మళ్లించడం కష్టమని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడింటిపై మరింత లోతుగా కసరత్తు చేసి నిర్మాణ ఖర్చులో కొంత తేడా ఉన్నా, తాగునీటికి నూరు శాతం ఇబ్బంది లేని పథకం వైపు మొగ్గు చూపాలన్న ఆలోచనతో నీటిపారుదల, పురపాలక శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది.

'హైదరాబాద్​లో 2050 వరకు తాగునీటికి ఏ కొరతా ఉండదు'

'హైదరాబాద్‌ తాగునీటి కోసం ప్రత్యేక రిజర్వాయర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.