ETV Bharat / state

రెండ్రోజుల్లో తెలంగాణకు 'నైరుతి' - రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు వర్షాలు - TELANGANA RAINS ALERT TODAY - TELANGANA RAINS ALERT TODAY

Telangana Monsoon Updates : నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి పవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతోపాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని, ఈ ప్రభావంతోనూ తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని ప్రకటించింది.

Heavy Rains in Hyderabad
Today IMD Report in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 6:59 AM IST

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ (ETV Bharat)

Telangana Weather Report Today : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు పసుపు రంగు(ఎల్లో) హెచ్చరికలను జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్​లో మోస్తరు వర్షాలు పడతాయని ప్రకటించింది.

South West Monsoon in Telangana : నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి పవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతోపాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ప్రభావంతోనూ తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

Hyderabad Rains : మరోవైపు నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే వరుణుడి రాక మొదలైంది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, ఉప్పల్‌, రామాంతపూర్‌, బోడుప్పల్‌, మేడిపల్లి, కుత్బుల్లాపూర్‌, సుచిత్ర, కొంపల్లి, చింతల్‌, సూరారాం, బాలానగర్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ప్యాట్నీ ప్యారడైజ్‌, బేగంపేట్‌ ప్రాంతాల్లో ఆదివారం ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయంగా మారాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు భారీగా చేరింది. రాకపోకలు సాగించేవారు అవస్థలు పడ్డారు.

తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు - ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ

Heavy Rain in Mahabubabad: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ వేడితో అల్లాడిన ప్రజానీకం చల్లపడిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదురు గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కేసముద్రంలో పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. భూపాలపల్లి నియోజకవర్గవ్యాప్తంగా గాలివాన బీభత్సంతో జనం ఉలిక్కిపడ్డారు. పగలంతా ఎండలతో అల్లాడిన ములుగు జిల్లా వాసులు సాయంత్రానికి పడిన వర్షంతో ఊరట పొందారు. ఏటూరునాగారం, గోవిందరావుపేట, ములుగు, వాజేడు మండలాల పరిధిలో గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది.

నిలిచిపోయిన విద్యుత్​ సరఫరా : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం గూడూరు దర్గా వద్ద మర్రి చెట్టు కొమ్మ విరిగిపడి కారు ధ్వంసమైంది. చండి విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్తు టవర్ విరిగిపడగా కరెంట్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పడిన భారీ వర్షంతో గుండి వాగు వద్ద ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు గ్రామాల్లో స్తంభాలు పడిపోయి కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. బెజ్జారు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలుల ధాటికి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.

రాష్ట్రంలో రాగల రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Telangana Weather Forecast

Southwest Monsoon Telangana : పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షానికి జనం బెంబేలెత్తిపోయారు. మంథని మండలం ఉప్పట్లలో తాటిచెట్టుపై పిడుగు పడగా ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ధ్వంసమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. చాలా గ్రామాల్లో పిడుగుల వర్షానికి జనం భయాందోళనకు గురయ్యారు. యాదగిరిగుట్టలో చిరుజల్లులకు వాతావరణం చల్లపడి భక్తులు ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాలు కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

రాష్ట్ర ప్రజలకు ఐఎండీ హెచ్చరిక - 4 రోజులపాటు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Telangana Weather Report

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.