Son Killed Father in Turkayamjal : మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో దారుణానికి పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికైనా వెనకాడటం లేదు. తాజాగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన ఓ కుమారుడు కన్నతండ్రినే (Son at Killed Father)దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్‌పోసి నిప్పంటించి బండరాయితో తలపై మోది హతమార్చాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్‌లో జరిగింది.
Drug Addict Son at Killed Father : ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన తిరుపాటి రవీందర్ (60) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో స్థిరపడి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన తన మొదటి భార్య చనిపోగా సుధ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. పెద్ద అబ్బాయి చాలా సంవత్సరాలు క్రితమే చనిపోయాడు. చిన్న కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు.
తండ్రిని హత్య చేసిన కుమారుడు.. రంపంతో ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో..
రవీందర్ తన రెండో భార్య సుధతో కలిసి రెండు నెలల క్రితమే తుర్కయంజాల్‌లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో కొత్తగా కొన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరికి అనురాగ్, అభిషేక్ ఇద్దరు కుమారులు. పెద్ద అబ్బాయి అనురాగ్ ఖాళీగా ఉంటున్నాడు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు అతడు బానిసై అందరితోనూ నిత్యం గొడవలు పడేవాడు. అతణ్ని రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించి చికిత్స చేయించినా మార్పురాలేదు.
అనురాగ్‌పై రెండు పోలీసు కేసులు ఉన్నాయి. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించాడు. మూడురోజుల క్రితం అతను పెట్రోలు సీసాను ఇంటికి తెచ్చాడు. అది ఎందుకు తెచ్చావని తల్లిదండ్రులు అనురాగ్‌ను ప్రశ్నించారు. ద్విచక్రవాహనంలో పోయడానికని చెప్పాడు. గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో పాటు అనురాగ్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. తల్లి పడకగదిలో ఉండగా తాళం పెట్టిన అతడు తండ్రి రవీందర్‌తో ఘర్షణకు దిగాడు.
రూ.3,000 కోసం తండ్రిని చంపి ఆరు ముక్కలుగా చేసిన కుమారుడు!
Murder Cases in Telangana : వెంటనే అనురాగ్ పెట్రోల్‌ను తండ్రి రవీందర్‌పై పోయబోయాడు. తప్పించుకున్న ఆయన భయంతో బయటకు పరుగులు తీశాడు. వెంబడించి ఇంటికి కొద్దిదూరంలోనే తండ్రిని పట్టుకుని ఒంటిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. మంటల్లో కాలిపోతూ అరుస్తున్న రవీందర్‌ను అనురాగ్ బండరాయితో తలపై మోది హతమార్చి, అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. దీనిపై స్థానికుల సమాచారంతో ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. మరోవైపు ఈ హత్యతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
బీమా కథా చిత్రమ్.. డబ్బు కోసం తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు
Son kills Father: కన్నతండ్రిని చంపిన కొడుకు... కారణం అదేనా..?