Khammam People Boycotted Elections : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఓటర్లు పలు ప్రాంతాల్లో ఓటింగ్ బహిష్కరిస్తూ నిరసస బాట పట్టారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని రాయమాదారం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం కొమ్ముగూడెం తండా వాసులు సాగు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని ఓటింగ్ స్లిప్పులు చూపుతూ నిరసన తెలిపారు.
నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో బల్మూర్ మండలం మైలారం గ్రామస్థులు మైనింగ్‌కు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అమరగిరిలో తాగునీరు, విద్యుత్, రహదారుల సమస్యలు పరిష్కారం చేయాలని, చెంచు గిరిజనులు ఓట్లు వేయకుండా నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి పరిధిలోని రామ్‌సాగర్ తండా వాసులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
పోలింగ్ బూత్ కోసం ఎన్నికలను బహిష్కరించిన తండావాసులు : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని కొడిచెర్ల గ్రామతాండ వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గతంలో చెప్పినా అధికారులు వినిపించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తండావాసులు రోడ్డుపై బైఠాయించారు. కొత్తూరు తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని తండావాసులతో మాట్లాడి శాంతింపజేశారు.
Mailaram Village Boycotted Elections : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో బల్మూర్ మండలం మైలారంలో ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామంలో నిర్వహిస్తున్న మైనింగ్‌కు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అమరగిరిలో తాగునీరు, విద్యుత్, రహదారుల సమస్యలను పరిష్కారం చేయాలని. చెంచు గిరిజనులు ఓట్లు వేయకుండా నిరసన వ్యక్తం చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బొరిగాం గ్రామంలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి ఎన్నో ఏండ్లుగా రహదారి సౌకర్యం కల్పించడంలేదని అందుకే ఎన్నికలను బహిష్కరించామని గ్రామస్థులు తెలిపారు.