Some Trains Cancellation Due to Dhana Cyclone in Andhra Pradesh : బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం ఉదయానికి తుపానుగా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందొచ్చని ఐఎండీ పేర్కొంది. గురువారం అర్ధరాత్రినుంచి శుక్రవారం ఉదయంలోగా పూరీ (ఒడిశా), సాగర్ ద్వీపం (పశ్చిమబెంగాల్) మధ్యలో తీరం దాటొచ్చని భావిస్తోంది.
ఉత్తరాంధ్రకు వర్ష సూచన : ‘తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండకపోవచ్చు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీనిపై బుధవారంనాటికి స్పష్టత వస్తుంది’ అని ఐఎండీ మాజీ డీజీ డా.కేజే రమేష్ తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం - రెండు రోజులు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
పలు రైళ్ల రద్దు : ‘దానా’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. వాటిలో దూర ప్రాంత సర్వీసులు సహా దగ్గర సర్వీసులూ ఉన్నాయి. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, పూరీ తదితర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించేవి ఉన్నాయి. విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ రైలును 24న రద్దు చేశారు.
23వ తేదీ రద్దైన రైళ్ల వివరాలు
1. రైలు నం. 22503 కన్నియాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్
2. రైలు నం. 12514 సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్
4. రైలు నం. 12840 MGR చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్
5. రైలు నం. 12868 పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్
6. రైలు నం. 22826 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్
7. రైలు నం. 12897 పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
8. రైలు నం. 18464 KSR బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
9. రైలు నం. 11019 CST ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్
10. రైలు నం. 12509 SMV బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్
11. రైలు నం. 18046 హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
12. రైలు నెం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
13. రైలు నం. 22888 SMVT బెంగళూరు- హౌరా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
14. రైలు నం. 12864 SMVT బెంగుళూరు- హౌరా SF ఎక్స్‌ప్రెస్
15. రైలు నం. 09059 సూరత్-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్
16. రైలు నం. 12552 కామాఖ్య- SMV బెంగళూరు AC ఎక్స్‌ప్రెస్
17. రైలు నం. 22504 దిబ్రూఘర్- కన్నియాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
18. రైలు నం. 22973 గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్
బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ - అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక
24వ తేదీ రద్దైన రైళ్ల వివరాలు
1. రైలు నెం. 03429 సికింద్రాబాద్-మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
3. రైలు నం.12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
4. రైలు నం. 22603 ఖరగ్‌పూర్-విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్
5. రైలు నం. 18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
6. రైలు నం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్
7. రైలు నం. 12841 షాలిమార్ - MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్
8. రైలు నెం. 12663 హౌరా-తిరుచ్చిరాపల్లి SF ఎక్స్‌ప్రెస్
9. రైలు నం. 12863 హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్‌ప్రెస్
10. రైలు నం. 18047 షాలిమార్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్
11. రైలు నం. 12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్
12. రైలు నం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్
13. రైలు నం. 06090 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
14. రైలు నం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
15. రైలు నం. 08421 కటక్- గుణుపూర్ MEMU
16. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
17. రైలు నం. 07471 పలాస-విశాఖపట్నం MEMU
18. రైలు నం. 20837 భువనేశ్వర్-జునాగర్ ఎక్స్‌ప్రెస్
19. రైలు నెం. 18447 భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
20. రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్
21. రైలు నం. 20842 విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్
22. రైలు నం. 22874 విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్
23. రైలు నం. 18118 గుణుపూర్-రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
24. రైలు నం. 22820 విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
25. రైలు నం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
26. రైలు నం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్
27. రైలు నం. 22808 MGR చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్
28. రైలు నం. 15227 SMVT బెంగళూరు-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
29. రైలు నం. 20838 జునాగర్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
30. రైలు నం. 18448 జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
31. రైలు నం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
32. రైలు నం. 12246 SMV బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్
33. రైలు నం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్
34. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్
35. రైలు నం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
36. రైలు నం. 07470 విశాఖపట్నం- పలాస మెము
37. రైలు నం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్
బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం - ఉత్తరాంధ్రలో వర్షాలు!
25వ తేదీ రద్దైన రైళ్ల వివరాలు
1. రైలు నెం. 09060 బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
2. రైలు నం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం. 22819 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం. 08531 బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
5. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం
6. రైలు నం. 18525 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
7. రైలు నం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్
8. రైలు నం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్
9. రైలు నం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్
10. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
11. రైలు నం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్
కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు