Ration Distribution Centers Weigh Frauds : ఓ వ్యక్తి రేషన్ షాపునకు వెళ్లాడు.. అక్కడే ఉన్న సహాయకుడు బియ్యాన్ని ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఇంటికి బియ్యాన్ని తీసుకోచ్చేశాడు. ఎందుకో ఆ ఇంట్లో వాళ్లకు బియ్యం తక్కువగా వచ్చాయని అనుమానించారు.. పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లి తూకం వేశారు. ఆ తూకం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. రేషన్ దుకాణంలో తూకానికి కిరాణా షాపులో తూకానికి 650 గ్రాములు తక్కువగా బియ్యం వచ్చాయి. తాను మోసపోయానని గ్రహించి అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు. ఈ సమస్య ఇప్పుడు అతని ఒక్కరిదే కాదు రాష్ట్రంలోని పలు రేషన్ పంపిణీ దుకాణాల్లో జరుగుతున్న మోసాలు. అసలేలా ఈ తూకం మోసాలు చేస్తున్నారని అనుకుంటున్నారా? వీటి నుంచి ఎలా బయటపడాలని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదివేయండి.
రేషన్ పంపిణీ కేంద్రాల్లో ఈ-పాస్ యంత్రాలకు ఎలక్ట్రానిక్ కాంటాలను కనెక్ట్ చేసినా సరే తూకం ఇలానే వస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అసలు ఈ-పాస్ యంత్రాలనే రేషన్ దుకాణాల్లో జరిగే మోసాలను అరికట్టడానికి ఏర్పాటు చేశారు. అయినా సరే కొందరు అక్రమ డీలర్లు మోసాలకు పైఎత్తులను వేస్తున్నారు. డబ్బులు సంపాదించాలనే కోరికతో.. కొన్ని రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ కాంటాను కాలికి దగ్గరగా పెట్టుకొని బొటన వేలితో రహస్యంగా నొక్కి ఉంచుతున్నారు.
దీంతో తూగాల్సిన దానికన్నా తక్కువగా వస్తువులు తూగుతున్నాయి. లబ్ధిదారుడు 500 గ్రాములు నుంచి 1200 గ్రాములు వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా బియ్యాన్ని స్వాహా చేసి పక్కదారి పట్టించి లబ్ధిదారుడికి భారీ నష్టాన్నే మిగుల్చుతున్నారు కొందరు రేషన్ డీలర్లు. మరోపక్క ఎలక్ట్రానిక్ కాంటాపై కొందరు డీలర్లు గోనె సంచిని నీటిలో తడిపి వేస్తున్నారు. ఇలాంటి తూకాల మోసాలు రాష్ట్రంలోని పలు రేషన్ పంపిణీ దుకాణాల్లో జరుగుతున్నాయి.
షాపులో చూస్తే 24 కేజీలు.. ఇంటికొచ్చి చూస్తే 650 గ్రాములు తక్కువ : తాజాగా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని రేషన్ పంపిణీలో మోసం జరిగింది. ఓ లబ్ధిదారుడు తన కుటుంబానికి రావాల్సిన 24 కేజీల బియ్యాన్ని తీసుకొచ్చేందుకు రేషన్ షాపునకు వెళ్లాడు. అక్కడ రేషన్ డీలర్ ఎలక్ట్రానిక్ కాంటాపై గోనె సంచి వేసి తూకం తూయడం చూశాడు.. ఇదేంటని ప్రశ్నించిన అతడు గోనె సంచి తీయకుండానే బియ్యం కొలిచి పంపించేశాడు. దీంతో చేసేదేమీ లేక అనుమానం వచ్చి ఓ కిరాణా దుకాణంలో బియ్యాన్ని తూకం వేయగా 24 కిలోలకు 650 గ్రాములు తక్కువగా బియ్యం వచ్చాయి.
దీంతో లబ్ధిదారుడు తాను మోసపోయానని గమనించాడు. ఇలాంటి మోసాలు కేవలం కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని రేషన్ పంపిణీ దుకాణాల్లో ఇలానే అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి.. అక్రమాలకు పాల్పడే వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
నవంబర్ నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఆ 3 వస్తువులు - అస్సలు మిస్సవకండి