ETV Bharat / state

మగవాళ్లూ మారాలి - బాధను పంచుకోకున్నా తప్పదు మరణముప్పు!

ఆరోగ్య సమస్యలను ఇతరులతో పంచుకోక బాధ పడే మగవాళ్లలో ఎక్కువగా గుండెజబ్బులు - యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో శాస్త్రవేత్తలు తేల్చిన నిజాలు ఇవే!

This Habits Causes Heart Disease in Men
This Habits Causes Heart Disease in Men (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 4:24 PM IST

This Habits Causes Heart Disease in Men : పలు విషయాల్లో ఆడవాళ్లు బేలగా మారి, ఏదైనా ఉంటే పైకి చెప్పుకుని బాధపడతారు. దాంతో ఆ విచారం నుంచి ఉపశమనం కూడా పొందుతారు. పురుషులు అలా కాదు. గుంభనంగా ఉంటారు. ఏ విషయాన్నీ పైకి డైరెక్ట్​గా చెప్పరు. నోరు తెరిచి హెల్ప్​ అడగలేరు. ఇలా చేస్తే ఎక్కడ తమను నలుగురూ చిన్నచూపు చూస్తారోననే భయం. ఇదిగో ఈ అలవాటే మగవాళ్లలో ముఖ్యంగా గుండెజబ్బులు పెరగడానికి కారణం అంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం.

చిన్న అనారోగ్యమేగా? అన్న నిర్లక్ష్యపు ధోరణి.. ‘ఇది మనల్ని ఏం చేస్తుందిలే అనే ధీమా వాళ్లని సకాలంలో ట్రీట్​మెంట్​ తీసుకోనివ్వకుండా చేస్తున్నాయట. ఒక వేళ వాళ్లకి నిజంగా ఏదైనా సమస్య ఉందని తెలిసినా, దాని గురించి చర్చించడానికీ పెద్దగా ఇష్టపడరట. 24 సంవత్సరాల కాలంలో సుమారు 1400 మందిపైన చేసిన రీసెర్చ్​లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా కీలకం అంటున్నారు అధ్యయనవేత్తలు.

ఈ అలవాటుతోనూ మగవాళ్లలో గుండెజబ్బులు

మగవారిలో గుండె జబ్బులు పెరుగుతున్న సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలిలోని కొన్ని అలవాట్లు. ఈ అలవాట్లను మార్చుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించుకోవచ్చు.

ధూమపానం : సిగరెట్, బీడీ వంటివి తాగడం గుండెకు పెద్ద శత్రువు. ఇది రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి, గుండెపోటుకు ప్రధాన కారణం.

అధిక ఆల్కహాల్ సేవనం : అధికంగా మద్యం తాగడం కూడా గుండెకు హాని కలిగిస్తుంది. ఇది రక్తపోటును పెంచి, గుండె కండరాలను దెబ్బతీస్తుంది.

అనారోగ్యకరమైన ఆహారం : ఎక్కువగా జంక్ ఫుడ్, కొవ్వు ఆహారాలు, తీపి పదార్థాలు తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, గుండె జబ్బులకు దారితీస్తుంది.

శారీరక శ్రమ లేకపోవడం : వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, బ్లడ్​ ప్రెజర్, షుగర్ వంటి సమస్యలు వచ్చి గుండెపోటుకు దారితీస్తుంది.

ఒత్తిడి : అధిక ఒత్తిడి గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి.

నిద్ర లేమి : సరిపడా నిద్ర పోకపోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

అధిక బరువు : స్థూలకాయం గుండెపోటు, షుగర్, రక్తపోటు వంటి అనేక రోగాలకు దారితీస్తుంది.

గుండె జబ్బులను నివారించడానికి చేయవలసినవి

  • ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వెంటనే మానుకోవడం చాలా ముఖ్యం.
  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • రోజూ కనీసం 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం ప్రధానం.
  • యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రించవచ్చు.
  • రోజూ 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సహా వ్యాయామం చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.
  • ఏదైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

NOTE : పైన తెలిపిన వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య సమస్య ఉంటే వెంటనే డాక్టర్​ను సంప్రదించండి.

మీ 'గుండె' ఎంతో స్పెషల్- జాగ్రత్తగా కాపాడుకోండి - Take Care of Your Heart

ఈ 5 రకాల బాడీ పెయిన్స్​లో ఏది కనిపించినా అలర్ట్ కావాల్సిందే - గుండెపోటు సంకేతం కావొచ్చట! - Heart Attack Warning Signs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.