ETV Bharat / state

దీర్ఘకాలిక గురక యమ డెేంజర్ - నివారించకపోతే ప్రాణాలు గాల్లో!

నగరంలో అధికశాతం మందిని వేధిస్తున్న గురక సమస్య - నిమ్స్​కు పెరుగుతున్న ఓఎస్​ఏ కేసులు -స్లీప్​ స్టడీతో సమస్య గుర్తించి చికిత్స

Snoring Reasons And Remedies
Snoring Reasons And Remedies (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 9:25 AM IST

Updated : Oct 27, 2024, 9:32 AM IST

Snoring Reasons And Remedies : గ్రేటర్​లో చాలామందిలో గురక సమస్య వేధిస్తోంది. మధుమేహం, ఊబకాయం, కిడ్నీ(మూత్రపిండాల) సమస్యలతోపాటు మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కన్పిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా(ఓఎస్‌ఏ)’ అనేది ఈ గురకకు కారణం.

నిమ్స్‌ స్లీప్‌ ల్యాబ్‌కు నెలకు 30 మందికిపైగా బాధితులు వైద్యనిపుణులను సంప్రదిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి నిద్రలోనే హార్ట్‌ ఎటాక్‌లు(గుండెపోటు) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్రోజన్‌ ఎంజైమ్‌ కారణంగా మహిళల్లో అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ అప్నియా తక్కువగా ఉంటుంది.

పలు పరికరాలతో స్లీప్​ స్టడీ పరీక్ష : స్లీప్‌ అప్నీయా సమస్యతో బాధపడే వారికి స్లీప్‌ స్టడీ అవసరమవుతుంది. నిమ్స్‌ ఆసుపత్రిలో దీని కోసం ప్రత్యేక ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. గురకతో ఇబ్బందిపడుతున్న వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని బహుళ శరీర వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నాయో ప్రత్యేక పరికరాలతో పరిశీలించి రికార్డు చేస్తారు. మెదడు పనితీరును తెలుసుకునేందుకు ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రఫీ(ఈఈజీ), గుండె పనితీరు తెలుసుకోవడం కోసం ఎలక్ట్రో కార్డియోగ్రఫీ(ఈసీజీ), కండరాల కదలికల కోసం ఎలక్ట్రోమియోగ్రామ్‌ తదితర పరికరాలను శరీరానికి అమర్చి ఏ మేరకు నాణ్యమైన నిద్రపోతున్నారో పరీక్షిస్తారు.

ఈ లక్షణాలు కనిపిస్తే

  1. నిద్రపోయినా ఉదయం లేవగానే నిద్రలేమిగా ఉన్నట్లుగా అనిపించడం
  2. నిద్రలో 5 కంటే ఎక్కువ సార్లు శ్వాస ఆగిపోయినట్లుగా అనిపించి మెలకువ రావడం
  3. రాత్రిపూట ఛాతీలో నొప్పి నిద్రలేవగానే గొంతులో నొప్పిగా ఉండటం
  4. నిద్ర లేవగానే తలనొప్పి ఉండటం. ఏకాగ్రత లేకపోవడం

అప్రమత్తత అవసరం : జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఊబకాయం తదితర సమస్యలతో గురక పెరుగుతోంది. దీర్ఘకాలిక గురక ఉంటే స్లీప్‌ స్టడీ టెస్టు ద్వారా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిమ్స్‌లో ఇందుకు సంబంధించిన ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇబ్బంది ఎక్కువ ఉన్న పేషెంట్లకు సిపాప్‌ చికిత్స సిఫార్సు చేస్తున్నాం. తక్కువ ఉంటే లైఫ్​స్టైల్​లో మార్పులు చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యశ్రీలో గురకకు సంబంధించి పరీక్షలు తెచ్చేలా నిమ్స్‌ వైద్యశాల ఏర్పాట్లను చేస్తోంది అని నిమ్స్​ పల్మనాలజీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్​ జి.కె.పరంజ్యోతి సూచిస్తున్నారు

గురకే కదా అని తీసి పారేయకండి - క్యాన్సర్​ రావడం గ్యారెంటీ?

మౌత్ గార్డ్​తో నిద్రపోతున్నారా..? ఏం జరుగుతుందో తెలుసా??

Last Updated : Oct 27, 2024, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.