ETV Bharat / state

ఏకధాటిగా 72 పాటలు పాడిన సింగర్ - 5 రికార్డులు దాసోహం - ఇంతకీ ఆమె ఎవరంటే? - SINGER SANDHYA FIVE AWARDS

6 గంటల పాటు 72 పాటలు పాడిన గాయని - ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర పాడిన పాటలు పాడి ఐదు రికార్డులు సొంతం

Singer Sandhya SINGING 72 SONGS
Singer Salwaji Sandhya Five Records (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 10:47 AM IST

Singer Salwaji Sandhya Five Records : కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన గాయని సల్వాజి సంధ్య స్థానిక కలెక్టర్‌ ఆడిటోరియంలో 6 గంటల పాటు 72 పాటలు పాడి ఐదు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆదివారం ఉదయం సల్వాజి ప్రవీణ్‌ మ్యూజికల్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రపంచ రికార్డు కోసం ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర పాడిన పాటలు పాడారు.

72 పాటలు పాడి ఐదు రికార్డులు సొంతం : జిల్లా కేంద్రానికి చెందిన సంధ్య.. ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు పాటల కార్యక్రమాన్ని ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు ముగించారు. 8 మంది సంగీత వాయిద్యకారుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. భారత్‌ వరల్డ్‌ రికార్డ్‌, సింగర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, యూనివర్సల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, కల్చరల్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రికార్డులను నెలకొల్పారని నిర్వాహకులు వరల్డ్ రికార్డ్ కో ఆర్డినేటర్ కేవీ రమణారావు తెలిపి అభినందించారు.

కరీంనగర్​కు చెందిన సల్వాజి సంధ్య చిన్ననాటి నుంచి గాయకురాలు. తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ రాష్ట్ర స్థాయిలో మన్ననలు పొందారు. గత 15 సంవత్సరాలుగా లైవ్ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ రాణిస్తున్నారు. సంధ్యకు చిన్న నాటి నుంచే నేపథ్య గాయకురాలు చిత్ర అంటే మక్కువ ఎక్కువ. గాయకురాలు చిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఆమె పాటలు పాడుతూ ప్రముఖ గాయనీగాయకుల వద్ద శెభాష్ అనిపించుకున్నారు. సల్వాజి సంధ్య భర్త సల్వాజి ప్రవీణ్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తుండగా, ఆమె ఆయన సహకారంతో పాటలు పాడుతూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు.

ఈరోజు నా కల నెరవేరింది. నాకు చిత్రగారంటే ఎంతో ఇష్టం. 15 ఏళ్లుగా నేను ఆమె పాటలు పాడుతున్నాను. ఈరోజు ఏకధాటిగా 6 గంటల పాటు చిత్రగారు పాడిన 72 పాటలు పాడాను. 5 రికార్డులు నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉంది. - సల్వాజి సంధ్య, గాయని

Singer Salwaji Sandhya Five Records
5 రికార్డులు సొంతం చేసుకున్న గాయని సల్వాజి సంధ్య (ETV Bharat)

అప్పుడు రూ.50 కోసం స్టేజ్​షో- ఇప్పుడు పాటకు రూ.10లక్షలు- సక్సెస్ అంటే ఇది! - Neha Kakkar Career

YUVA : ప్రకృతి పరవశించేలా గానం- సాగులో కన్నవాళ్లకు సాయం - ఈ జానపద గానకోకిల గాథ మీరూ తెలుసుకోవాల్సిందే - Special Story On Folk Singer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.