ETV Bharat / state

ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదా? - ఇలా చదివితే క్లాస్​లో ఫస్ట్​ ర్యాంక్​ మీదే!

మీ పిల్లలు ఎంత చదివినా గుర్తుండటం లేదా? - అసలు మర్చిపోవడానికి కారణాలేంటి? - ఏవిధంగా చదివితే ఎక్కువకాలం గుర్తుంచుకోవచ్చు.

Simple Memory Tips For Students
Simple Memory Tips For Students (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 5:32 PM IST

Simple Memory Tips For Students : పాఠాలను ఎప్పటికప్పుడు చదివి మంచి మార్కులు సాధించాలనుకుంటారు కొందరు స్టూడెంట్స్​. కానీ పరీక్షలు రాసే సమయానికి ఒక్కోసారి ఎంత ప్రయత్నించినప్పటికీ చదివినవన్నీ గుర్తుకురావు. ఇలా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయంతో పాటు చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే ఏవిధంగా చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

చదివినవి ఎక్కువకాలం గుర్తుండాలంటే?

  • చదివినవాటిని ఎక్కువకాలం గుర్తుంచుకోవాలంటే ముందుగా కావలసింది ఏకాగ్రత. ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఉండి చదువుకున్నవి అంత త్వరగా మర్చిపోలేరు. అలాగే ఒక అంశాన్ని ఒక నిర్ణీత సమయంలోగా నేర్చుకోవాలనే కచ్చితమైన నిబంధన పెట్టుకోవాలి. ఆ సమయంలో ఇతర అంశాల గురించి ఆలోచించకుండా పాఠ్యాంశం మీదే దృష్టిని కేంద్రీకరించాలి. ఈ విధంగా ఏకాగ్రతతో చదివినవి ఎక్కువకాలం గుర్తుంటాయి.
  • ఒకేసారి ఎక్కువ లెసన్స్​(పాఠాలు) చదివేయాలని ఆరాటపడకూడదు. ఇలా చదవడం వల్ల త్వరగా మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో చదివి ఆ తర్వాత దాన్ని రివిజన్​ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. దాంతో అంత త్వరగా మర్చిపోలేరు.
  • శ్రద్ధగా విన్న పాఠ్యాంశాన్ని అంత త్వరగా మర్చిపోలేరు. తోటి విద్యార్థులతో చర్చించడం, అర్థంకానివారికి చెప్పడం వల్ల చదివింది బాగా గుర్తుంటుంది. ప్రాజెక్టు వర్కులు, ప్రయోగాలు చేయడం, చదివినవాటిని వాస్తవ పరిస్థితులకు అన్వయించుకోవడం వల్ల కూడా ఎక్కువ కాలం గుర్తుండేందుకు అవకాశం ఉంది.
  • శారీరక వ్యాయామం(ఎక్సర్​సైజ్​) చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటాం కదా? అలాగే మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడూ క్రాస్‌వర్డ్స్, పజిల్స్​ను, సుడోకులను పూరించడం, చెస్​ ఆడటం లాంటివి చేయాలి. కొత్త భాష లేదా సంగీతం నేర్చుకోవడం వల్ల కూడా మెమరీ పవర్​ మెరుగవుతుందంటారు.
  • చదువుతున్నప్పుడు సాధారణంగా దాహం వేయడాన్ని గమనించే ఉంటారు. అందుకే వాటర్​ బాటిల్​ను మీ దగ్గర ఉంచుకోండి.

మరిన్ని టిప్స్​ :

  • మీరు చదవడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకోండి. అంటే గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో రీడింగ్​ చేయడం ఉత్తమం.
  • చదువుతున్నప్పుడు మధ్యలో కాస్త విరామం ఇస్తుండండి. ఆ సమయంలో అప్పటివరకు చదివిన విషయాలను నెమరు వేసుకోండి.
  • మ్యాథ్స్​లో అయితే ఫార్ములాలను ఓ చార్ట్​పై రాసుకుని గోడకు అతికించుకోండి. ఆ ఛార్ట్​ను మీరు రోజూ చూడటం వల్ల అవి బాగా గుర్తుంటాయి.
  • పాఠం చదువుతున్నప్పడు అ పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను పాయింట్స్​గా రాసుకోండి. అలా చేయడం వల్ల పరీక్షల సమయంలో రివిజన్​ వేగంగా చేయవచ్చు.
  • బడిలో టీచర్​ చెప్పే పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విని రన్నింగ్​ నోట్సు రాసుకోండి.
  • ఆ రోజు స్కూల్​లో చెప్పిన వాటిని ఇంటికి వచ్చాక ఓ సారి చదివి సందేహాలు రాసుకుని టీచర్​ను అడగండి.
  • రేపు చెప్పబోయే పాఠాన్ని మీరు ముందుగానే ఇంటివద్ద చదివి వెళ్లడం వల్ల మీకు క్లాస్​ బాగా అర్థం అవుతుంది.
  • పిల్లలకు ఫోన్​ను దూరంగా ఉంచడమే మంచిది.

ఎంత తినిపించినా మీ పిల్లలు బక్కగానే ఉంటున్నారా? - ఇక్కడ చేర్పిస్తే బాల భీములవుతారు!

పిల్లలు తరచూ ఫోన్‌ చూస్తున్నారా - సైబర్‌ బానిసత్వానికి గురయ్యారేమో - ఈ అలవాట్లుంటే జాగ్రత్త పడాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.