Side Effects of Rusk with Tea : చాలా మంది టీలో బ్రెడ్, రస్క్‌లు వేసుకుని తింటుంటారు. ఈ పద్ధతి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రస్క్‌లు కూడా బ్రెడ్‌తోనే తయారవుతాయి. బ్రెడ్‌ని డీహైడ్రేట్ చేసి, అదనపు షుగర్ లోడ్ చేయడంతోపాటు రుచిని తీసుకురావడం కోసం రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసి టోస్ట్లను ప్రిపేర్ చేస్తారు. అందుకే క్రిస్పీగా తినాలనుకునేవారికి బాగా నచ్చుతాయి. రస్క్‌లలో ట్రాన్స్ ఫ్యాట్లు, చక్కెర, గ్లూటెన్, ఫ్లేవర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
జీర్ణ సమస్యలు : మైదా కలిగిన రస్క్‌లలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ. కాబట్టి వీటిని తినడం ద్వారా జీర్ణక్రియ నెమ్మదించడమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే.. మీ పిల్లలు తింటుంటే వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వీటిలో అధికమొత్తంలో షుగర్, గ్లూటెన్ ఆకలి వేయకుండా చేస్తుంది.
చక్కెర స్థాయిల పెరుగుదల : రస్క్‌లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడమే కాకుండా.. మీరు మళ్లీ టీలో చక్కెర వేసుకుంటుంటారు. ఈ కారణంగా చక్కెర స్థాయిలు పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా.. వెయిట్ పెరగడం, డయాబెటిస్ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
"ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్" ప్రకారం.. రెండు సంవత్సరాల పాటు రోజుకు రెండు రస్క్‌లు తిన్నవారు 2.5 కిలో బరువు పెరిగారు. అలాగే జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం.. డైలీ రెండు రస్క్‌లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని తేలింది. అలాగే రస్క్‌లు తినడం మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 20% పెంచుతుందని వెల్లడైంది.
టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ తింటున్నారా? - జాగ్రత్త, మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్లే!
గుండె సమస్యలు : టోస్ట్‌లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఛాయ్‌తో కలిపి తీసుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే చక్కెర స్థాయిలు అధికమవుతాయి. కాబట్టి వీటిని తీసుకుంటే హెల్త్ డిస్టర్బ్ కావడమే కాకుండా జీవక్రియ ఆరోగ్యం ప్రభావితమవుతుంది. అదనంగా ఊబకాయం, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాపు, నొప్పి, విరేచనాలు : ఈ రస్క్‌లను కొన్నిసార్లు ఎక్స్‌పైరీ అయిన బ్రెడ్స్‌తో చేయడం వల్ల ఇవి ఫుడ్ పాయిజన్‌కి కూడా కారణం కావొచ్చు. ఫలితంగా వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా కొన్నిసార్లు వీటిని తింటే వాపు, నొప్పి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు రస్క్‌లు తినే అలవాటు ఉంటే ఇక నుంచైనా వాటిని తినడం మానేయాలని సూచిస్తున్నారు.