ETV Bharat / state

'నేనూ పోలీసునే - కేసు బుక్​ చేస్తారా' - డ్రంకెన్​ డ్రైవ్​ పరీక్షలో హల్​చల్​

బ్రీత్ అనలైజర్ పరీక్షకు మొండికేసిన డ్రైవర్ - పోలీసుల మీదే చిందులు

siddipet_traffic_acp_caught_drunk_and_drive_in_madhura_nagar
siddipet_traffic_acp_caught_drunk_and_drive_in_madhura_nagar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 4:50 PM IST

Siddipet Traffic ACP Caught Drunk And Drive in Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్​లోని మధురానగర్​ రోడ్డుపై ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ క్రమంలో తానో పోలీస్ అధికారినని ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కాడు. నడి రోడ్డుపై నానా రభస చేసి పోలీసు శాఖ పరువును బజారుపాలు చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.

సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్​ సహా మరో ముగ్గురు మంగళవారం రాత్రి సఫారీ కారులో అమీర్​పేట నుంచి ఎస్ఆర్​ నగర్ వైపునకు వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండటాన్ని గమనించారు. వెంటనే తాగి డ్రైవింగ్ చేస్తున్న కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని పక్కకు ఆపి తన సీటు నుంచి కిందకు దిగి వెనక సీటులోకి వెళ్లాడు. వెనకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కావేరి ఇదంతా గమనించింది.

వెనక సీట్లోని వ్యక్తే డ్రైవింగ్ చేశాడని ఆమె అక్కడున్న అధికారులకు చెప్పారు. తనిఖీల్లో భాగంగా వారి కారును ఆపి వెనక కూర్చున్న డ్రైవర్​ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు. అంతలో కారులోని వ్యక్తి కిందకు దిగి తాను సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అని, తమ కారు వదిలేయాలని హెచ్చరించాడు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని వదిలేయాలని బిగ్గరగా కేకలు వేశాడు.

వీడెవడండీ బాబూ - తాగేసి ఏకంగా బస్సు టాప్​పైనే పడుకుని ప్రయాణించాడు

బ్రీత్ అనలైజర్ పరీక్షకు డ్రైవర్ మొండికేశాడు. ఊదొద్దని అతనికి ఏసీపీ అడ్డుపడ్డాడు. అక్కడ తనిఖీలు చేసే కానిస్టేబుల్​ను ఏసీపీ సుమన్ కుమార్ తోసేశాడు. కారు బానెట్​పై గుద్దుతూ దూషిస్తూ, హల్​చల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. దాంతో ట్రాఫిక్​ పోలీసులు మధురానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్​కు తరలించి బ్రీత్ అనలైజర్ పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది.

మోతాదుకు మించి 39 పాయింట్లుగా నమోదైంది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని, అతడు అల్వాల్​కు చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, కారు నడిపిన జైపాల్ రెడ్డి, వారితో పాటు ఉన్న ఎం. శ్రీనివాస్, జి. వెంకర్రావులపై ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్సై జి. కాంతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో ఎస్సైపై దాడి - తీవ్ర రక్తస్రావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.