ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేరం అంగీకరించిన నిందితులు! - నేడు కస్టడీకి కోరనున్న పోలీసులు - Telangana Phone Tapping Case

SIB Ex DSP Praneeth Rao Case Updates : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో చంచల్​గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న నేరం అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరితో పాటు ప్రణీత్​రావును కలిపి విచారించాలని భావిస్తున్న పోలీసులు, ఈ మేరకు ముగ్గురి కస్టడీ కోసం నేడు పిటిషన్​ వేయనున్నారు.

TELANGANA PHONE TAPPING CASE
SIB Ex DSP Praneeth Rao Case Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 5:26 PM IST

Updated : Mar 26, 2024, 6:37 AM IST

SIB Ex DSP Praneeth Rao Case Updates : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నేడు పోలీసులు కస్టడీ పిటిషన్‌ను వేయనున్నారు. కేసులో ఏ-2, ఏ-3లుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, ఏ-1గా ఉన్న ప్రణీత్ రావును కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. కస్టడీలో భాగంగా ముగ్గురినీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, చంచల్​గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న భుజంగ రావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారి ఆదేశాల మేరకే తాము పని చేశామని, ప్రణీత్‌ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్‌డిస్క్‌ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. మరోవైపు విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్‌ రావు, రాధాకిషన్‌ పేర్లను నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. వారిని కూడా విచారించాల్సి ఉన్నందున, వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

తొలుత ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌ - TS PHONE TAPPING CASE UPDATE

భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు, ఐ న్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌ రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు - ఆ నేతల ప్రమేయం ఉన్నట్లు సమాచారం!

Last Updated : Mar 26, 2024, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.