ETV Bharat / state

ఫోన్​ ట్యాపింగ్​ కేసు - ప్రణీత్ రావును కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్​ - Praneeth Rao Case Updates

SIB Ex DSP Praneeth Rao Case Update : ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కేసులో ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రణీత్‌రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పుడు నిందితుడిని కస్టడీ కోరుతూ పిటిషన్​ దాఖలు చేశారు.

Former SIB DSP Praneeth Rao Arrest
Ex DSP Praneeth Rao Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 8:00 AM IST

Updated : Mar 14, 2024, 10:34 PM IST

మాజీ డీఎస్పీ అరెస్టు నేరాన్ని అంగీకరించిన ప్రణీత్​రావు

SIB Ex DSP Praneeth Rao Case Update : ఆధారాల ధ్వంసం కేసులో ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​రావును కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్​ దాఖలు చేశారు. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్​ దాఖలు చేయాలని ప్రణీత్​రావు తరఫు న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. కాగా ఈ విషయంపై శుక్రవారం వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రణీత్​రావు(Ex DSP Praneeth Case)ను కస్టడీలోకి తీసుకుంటే ఆధారాల ధ్వంసంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు దర్యాప్తు బృందం నిందితుడు ఎంత మంది కాల్​ డీటెయిల్​ రికార్డును సేకరించాడు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Phone Tapping Case Hyderabad : అయితే ఎఫ్​ఐఆర్​లో కూడా నిందితుల జాబితాలో ప్రణీత్​తో పాటు మరికొందరు అని మాత్రమే నమోదు చేశారు. ప్రస్తుతం వారెవరో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్​ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఎస్​ఐబీ కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రణీత్(Phone Tapping Case)​ ఉపయోగించిన రెండు గదులు, 17 కంప్యూటర్లను పరిశీలించింది. కాగా అతను ఎవరెవరి సీడీఆర్​, ఐఎంఈఐ, ఐపీడీఆర్​ డేటాను సేకరించాడు, ఎవరి ఆదేశాల మేరకు సేకరించాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో అతని ఆధీనంలో పని చేసిన ఎస్​ఓటీ సిబ్బందిని కూడా నిందితులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులు

ఫోన్​ ట్యాపింగ్​తో మొదలైన కేసు : మావోయిస్టుల గురించి ఆరా తీయడంతోపాటు పలువురు ప్రైవేటు వ్యక్తుల సంభాషణల్ని ప్రణీత్‌ బృందం విన్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా ఉండేందుకే ప్రణీత్ హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన కీలకసమాచారం సైతం మాయమైనట్లు గుర్తించారు.

ప్రభుత్వం మారిన తరుణంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే అంటే గత డిసెంబరు 4నే ఆధారాల్ని ధ్వంసం చేయడం పలు అనుమానాలకు తావిచ్చే అంశంగా మారింది. ఇదిలా ఉంటే ప్రణీత్​పై పంజాగుట్ట పీఎస్‌లో ఓ వ్యాపార వేత్త ఫిర్యాదు చేశాడు. తన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) చేయడంతో పాటు, తన కుటుంబ సభ్యులందరిని మానసికక్షోభకి గురి చేశారని స్థిరాస్తి వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం - ప్రణీత్​ రావు సహా మరికొంత మందిపై కేసు నమోదు

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్​పేట ఎమ్మార్వో

Last Updated : Mar 14, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.