ETV Bharat / state

రాష్ట్రంలో రోజుకు 20 లక్షలకు పైగా అమ్ముడుపోతున్న బీర్లు - అయినా డిమాండ్​కు తగ్గ సప్లై లేదట - SHoratge OF Beers In Hyderabad - SHORATGE OF BEERS IN HYDERABAD

Beers Shortage in Telangana : రాష్ట్రంలో డిమాండ్‌కు తగినట్లు బీర్లు లభ్యం కావడం లేదు. మండుటెండలతో విలవిల్లాడుతున్న జనం, చల్లటి బీర్లు తాగి చిల్​ అవుదామనుకుంటే వారికి నిరాశే మిగులుతోంది. రోజుకు 20 లక్షలకు పైగా బీర్లు అమ్ముడుపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నియమావళి అడ్డురావడంతో ఉత్పత్తి పెంచేందుకు బ్రీవరీలకు మూడో షిప్ట్‌కు అనుమతివ్వకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో డిమాండ్​కు తగ్గట్లుగా సరఫరా ఉండటం లేదు. ఎన్నికల మూలంగా అదనంగా బీర్లు అమ్ముడుపోతుండటంతో ఏర్పడిన ఈ కొరత, ఇప్పట్లో తీరే అవకాశం లేదని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.

Beers Shortage in Telangana
Shortage Of Beer Supply In Telangana (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 10:37 AM IST

Shortage Of Beer Supply In Telangana : తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్‌ అమ్మకాల కంటే బీర్లు విక్రయాలు అధికం. ఇక్కడ ఐటీ, ఫార్మా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉండడం, స్థిరాస్తి వ్యాపారం భారీగా వృద్ధి చెందడం, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేకాకుండా హైదరాబాద్‌ అంతర్జాతీయ డెస్టినేషన్‌ కావడంతో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ, వ్యాపార, వృత్తి తదితర అవసరాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా భారీ ఎత్తున ఉంటుంది. దీంతో ఇక్కడ మద్యం విక్రయాలు భారీ మొత్తంలో ఉంటాయి. 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 36,493 కోట్లు విలువైన 65.76 కోట్ల బీర్లు, 43.54 కోట్లు లిక్కర్ బాటిళ్లు మద్యం అమ్ముడు పోయింది.

లక్షలాది మంది యువత ఉద్యోగ, ఉపాధి పొందుతుండడంతో లిక్కర్‌ కంటే బీరు వాడకం అధికంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా బీరు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వేసవి వచ్చిందంటే లిక్కర్‌ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, బీర్లు విక్రయాలు పెరగడం సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్‌ అధికారులు కూడా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

బ్రీవరీలకు మూడో షిఫ్ట్​కు అనుమతి ఇచ్చి ఉత్పత్తిని పెంచడం, డిమాండ్‌ అధికంగా ఉండే బ్రాండ్లు కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ ఎన్నికల నియమావళి అడ్డురావడంతో ఇసారి ఇలాంటివి ఏవీ కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తోడు బీర్లు సరఫరా చేసే బ్రీవరీలకు ప్రతి 45 రోజులకు బిల్లులు చెల్లించే విధానం తెలంగాణాలో కొనసాగుతోంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బ్రీవరీలకు చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో దాదాపు రెండువేల కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.

లైట్​ బీర్ల కోసం యువకుడి పాదయాత్ర - అమ్మకాలు చేపట్టాలని ఆబ్కారీ శాఖకు వినతి పత్రం - Youth Padayatra For Beer

ఇందుకు సంబంధించి చెల్లింపులు చేయాలని కొత్త ప్రభుత్వాన్ని బ్రీవరీల యాజమానులు కోరుతున్నారు. ఇప్పటికే మూడో షిప్ట్‌ బీరు తయారీకి చెందిన, బిల్లులు పెండింగ్‌ రెండు ఫైళ్లు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మూడో షిప్ట్‌ బీరు ఉత్పత్తికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తోడు బీరు ధరలు కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలలో ఎక్కువ ఉండడం తెలంగాణాలో తక్కువ ఉండడంతో అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. ఇలా వివిధ కారణాలతో తెలంగాణ రాష్ట్రంలో బీరు డిమాండ్‌కు తగినంత సరఫరా లేదని మద్యం దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీరు ప్రియులు ఇష్టపడే బ్రాండ్లలల్లో ప్రధానంగా బడ్వైజర్, నాక్‌అవుట్‌, రాయల్‌ ఛాలెంజ్‌, కింగ్‌ఫిషర్‌, కార్లస్‌బెర్గ్‌, హైవార్డ్స్‌, టు​బర్గ్‌, కరోనా తదితర రకాలు ఎక్కువ అమ్ముడు పోతుంటాయని మద్యం దుకాణదారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు బ్రీవరీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రెండు లక్షలు మేర బీర్లు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. కానీ డిమాండ్‌ను బట్టి ఇక్కడ ఉత్పత్తిని పెంచుకోవడం, బయట నుంచి దిగుమతి చేసుకోవడం లాంటి ముందస్తు చర్యలు అబ్కారీ శాఖ తీసుకునేది.

వేసవికి ముందే అప్రమత్తమై బఫర్‌ స్టాక్‌ సిద్ధం చేసుకునేది. రాష్ట్రంలోని 17 మద్యం డిపోలల్లో వాటి సామర్థ్యాన్ని బట్టి కనీసం రెండు లక్షల బీర్లకు తక్కువ లేకుండా 20లక్షల బీర్లు వరకు బఫర్ స్టాక్‌ సిద్ధంగా ఉంచుకునే వారని డిమాండ్‌ను బట్టి సరఫరా చేసేవారని అబ్కారీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీర్లు విక్రయాలు ఏవిధంగా అమ్ముడు పోతున్నాయో పరిశీలన చేసినట్లయితే ఈ ఏడాది జనవరిలో 4.71 కోట్లు బీర్లు అమ్ముడు పోగా ఇందులో రెండో వంతు మాత్రమే లిక్కర్‌ విక్రాయాలు జరిగాయి.

టానిక్‌ మద్యం దుకాణం ఏర్పాటు జీవోలో మతలబుపై ప్రభుత్వం ఫోకస్! - Tonique LIQUOR STORES CASE

ఫిబ్రవరిలో 5.17 కోట్లు బీర్లు విక్రయాలు జరగ్గా లిక్కర్‌ ఇందులో రెండో భాగం కంటే తక్కువ అమ్మకాలు జరిగాయి. మార్చిలో 6.15 కోట్లు బీర్లు అమ్ముడు పోయాయి. లిక్కర్‌ ఇందులో సగమే విక్రయాలు జరిగాయి. ఏప్రిల్‌లో 6.02 కోట్లు బీర్లు విక్రయాలు జరిగాయి. లిక్కరు కూడా ఇందులో సగం కంటే కొంచం ఎక్కువ అమ్ముడు పోయింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణదారులు మార్చిలో ఎక్కువ బీర్లు తెచ్చుకుని దుకాణాల్లో స్టాక్‌ ఉంచుకోవడంతో ఏప్రిల్‌లో నెలలో స్వల్పంగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో అమ్ముడు పోయిన బీర్ల సంఖ్యను తీసుకుంటే రోజుకు సగటున 20లక్షలకుపైగా బీర్లు అమ్ముడు పోయాయి.

మే నెల రావడంతో బీర్ల అమ్మకాలు మరింత పెరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. భానుడి ప్రకోపంతో ఎండవేడిమి మరింత పెరుగుతోంది. ప్రతి రోజు కనిష్టం 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణ్రోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల తరువాత బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బీర్లు విక్రయాలు ఎక్కువ జరుగుతాయని అంచనా వేస్తున్న మద్యం దుకాణదారులు బఫర్‌ స్టాక్‌ పెట్టుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. మద్యం డిపోల్లో వీరు అడిగిన ఇండెంట్‌లో సగం కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఏ నిర్ణయం తీసుకున్నా నియమావళికి లోబడి ఉండాల్సి ఉంటుండడంతో కొరతతోనే ఈ వేసవి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆదాయం పెంచుకునే మార్గాలపై సర్కార్​ ఫోకస్ - ఎలైట్​ బార్లు, దుకాణాల ఏర్పాటుకు కసరత్తులు!

ఎన్నికల వేళ ఎక్సైజ్​శాఖ అలర్ట్ - వాటి సరఫరాపై ప్రత్యేక నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.