ETV Bharat / state

షిరిడీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు శ్రీనివాస్ కన్నుమూత - Dwarkamai Old Age Home Founder Died

Shirdi Dwarkamai old Age Home Founder Srinivas Died : కడుపున పుట్టినవారు ఉన్నా కనికరించి అన్నం పెట్టేవాళ్లు లేక చివరి మజిలీలో బతుకును భారంగా నెట్టుకొచ్చే వృద్ధులు ఎందరో మనకు తారసపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్లందర్నీ అక్కున చేర్చుకున్న షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు శ్రీనివాస్ ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీనివాస్ మృతితో వృద్ధాశ్రమంలో ఉన్న వందలాది మంది శోకసముద్రంలో మునిగిపోయారు.

Shirdi Dwarkamai old Age Home Founder Srinivas Died
Shirdi Dwarkamai old Age Home Founder Srinivas Died (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 5:28 PM IST

Shirdi Dwarkamai old Age Home Founder Srinivas Died : ఈ రోజుల్లో నలుగురు కుటుంబ సభ్యులున్న మధ్య తరగతి సంసారాన్ని ఈదడమంటేనే గగనం. అలాంటిది దాదాపు 500 మందిని, అది కూడా ఎవరి పని వాళ్లు చేసుకోవడం చేతకాని అభాగ్య వృద్ధుల్ని చూసుకోవడం అంటే మాటలు కాదు. కానీ శ్రీనివాస్‌ - సుధారాణి దంపతులు రెండు దశాబ్దాలుగా చేస్తున్నది అదే. అలాంటి వాళ్లందర్నీ అక్కున చేర్చుకున్న షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు శ్రీనివాస్ ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీనివాస్ మృతితో వృద్ధాశ్రమంలో ఉన్న వందలాది మంది శోకసముద్రంలో మునిగిపోయారు.

వృద్ధులు, వికలాంగులకు ఆరాధ్య దైవం : శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచి సాయిబాబా భక్తుడైన శ్రీనివాస్‌ చదువు, ఉద్యోగం గురించి ఏనాడూ ఆలోచించలేదు. భక్తిలో నిమగ్నమై విజయవాడ నుంచి వెళ్లి హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ సాయిబాబా గుడిలో పని చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో పిల్లలు నిర్లక్ష్యం చేసిన వృద్ధులు తరచూ బాబా గుడికి వెళ్లేవారు. నిత్యం అక్కడే ఉండే శ్రీనివాస్‌తో తమ కష్టాలు చెప్పుకుని బాధపడేవారు.

కొందరైతే తమకి కూడా అక్కడే ఆశ్రయం కల్పించమని వేడుకునేవారు. వాళ్ల బాధల్ని విని ఎంతో బాధపడేవాడు. అందుకోసం ఏం చేయాలో తెలిసేది కాదు. అలాగని వాళ్లని తనతోపాటే గుడిలో ఉంచడం కూడా సాధ్యం కాదు కదా అని ఆలోచించిన శ్రీనివాస్‌ క్రమంగా అలాంటి వాళ్లను బాగా చూసుకోవాలనే నిర్ణయానికొచ్చేశాడు. పైగా షిర్డీలోనే ఆ సేవ చేయాలని భావించాడు. దీనికి శ్రీనివాస్‌ తమ్ముడు రామ్‌మోహన్‌, కొందరు సాయి భక్తులు అండగా నిలబడ్డారు. వారి సహకారంతో శ్రీనివాస్‌ షిర్డీలో ఎకరం స్థలం కొన్నాడు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 500 మంది వృద్ధులు, వికలాంగులు ఈ వృద్ధాశ్రమంలో సాంత్వన పొందుతున్నారు.

అభాగ్యులకు సేవ చేస్తే చిన్న చూపు : చేతిలో డబ్బు లేకపోయినా దాతలు, స్నేహితుల సాయంతో అభాగ్య వృద్ధుల్ని చూసుకుంటున్న శ్రీనివాస్‌ కుటుంబాన్ని చాలామంది తక్కువగా చూసేవారు. కొందరు బంధువులు మాట్లాడటం, కలవడం మానేశారు. తమదికాని ప్రాంతంలో శ్రీనివాస్‌ దంపతులు చేస్తున్న నిస్వార్థ సేవ గురించి అందరికీ తెలియడానికి కూడా చాలా సమయం పట్టింది.

తన గురించి తెలిశాక 2003 నుంచి షిర్డీ సంస్థాన్‌ ట్రస్టు రాత్రి పూట ఆశ్రమానికి భోజనం పంపడం మొదలుపెట్టింది. ఆ తరవాత ట్రస్టు ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సదుపాయం, ఆశ్రమంలో నీటి వసతినీ కల్పించింది. కొన్నాళ్లకి శ్రీనివాస్‌ సేవ గురించి ఆ నోటా ఈ నోటా తెలియడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పంజాబ్‌ ఇలా రకరకాల ప్రాంతాలకు చెందిన వారు ఆశ్రమానికి రాసాగారు.

వృద్ధాశ్రమన్ని సందర్శించిన చంద్రబాబు : షిర్డీలో తెలుగువారు అత్యంత సేవాతత్పరతతో నిర్వహిస్తున్న ద్వారకామాయి వృద్ధాశ్రమాన్ని ఇటీవలే తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించారు. అనంతరం చంద్రబాబు దంపతులు ఆశ్రమంలోని వృద్ధులను పరామర్శించారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ద్వారకామాయి వృద్ధాశ్రమ నిర్వహణ తీరును చంద్రబాబు ప్రశంసించారు.

బండ్లమూడి శ్రీనివాస్‌ సోదరుల సేవానిరతిని చంద్రబాబు కొనియాడారు. ఆశ్రమ రిజిస్టర్‌లో చంద్రబాబు సంతకం చేశారు. రెండు దశాబ్దాలుగా ఆశ్రమంలో వేలాదిగా వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారికి మానవీయ దృక్పథంతో సేవ చేయడం అభినందనీయమని చంద్రబాబు దంపతులు అన్నారు. మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తికి ద్వారకామాయి వృద్ధాశ్రమం సేవలే నిదర్శనమని చంద్రబాబు ప్రశంసించారు.

గుండెలు పగిలేటట్లు రోదిస్తున్నా వృద్ధులు, వికలాంగులు : ప్రస్తుతం 500 మంది వృద్ధులకు ఈ ఆశ్రయంలో ఉన్నారు. శ్రీనివాాస్ దంపతులు ఈ అనాథలను 20 ఏళ్ల నుంచి ఉచితంగా చూసుకుంటున్నారు. ఆశ్రమంలో రోజూ పొద్దున్నే అందరికీ స్నానాలు చేయిస్తారు. ఇంట్లో మాదిరిగా చక్కగా ఏ పూటకాపూట బట్టలు ఉతికి మడత పెట్టి పెడతారు. ఎప్పటికప్పుడు వేడివేడిగా వండి బాబాకి నైవేద్యం పెట్టాక వృద్ధులకు పెడతారు.

ప్రతి ఒక్కర్నీ వేడుకల్లో భాగం చేస్తారు. ఇక ఆశ్రమంలో ఎవరు మరణించినా శ్రీనివాసే వారి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పేగు బంధం లేకపోయినా అభాగ్య వృద్ధులు ఆనందంగా ఆఖరి శ్వాస విడిచే వరకూ ప్రేమగా చూసుకుంటున్న, షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు శ్రీనివాస్​నే చివరికి మరణించడంతో వృద్ధులు, వికలాంగులు గుండెలు పగిలేటట్లు రోదిస్తున్నారు. శ్రీనివాస్ మరణంతో షిర్డీ సహా చుట్టూ పక్కల ప్రాంతమంత దుఃఖంతో నిండిపోయింది. శ్రీనివాస్ అంతక్రియలు ఈరోజు సాయంత్రం షిర్డీలోని అమర్ధంలో జరగనున్నాయి.

New Queue Complex at Shirdi Sai baba Temple : షిర్డీకి నూతన క్యూ కాంప్లెక్స్.. కష్టాలు తీరాయని భక్తుల హర్షం

Guru Purnima Celebrations: షిర్డీ సాయినాథునికి బంగారు కిరీటం.. కానుకగా సమర్పించిన హైదరాబాద్​వాసి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.