ETV Bharat / state

అప్పు అడిగితే ఇవ్వలేదని చంపేసి తీసుకున్నారు - చిన్న పనితో దొరికిపోయారు - Shadnagar Murder Case

Shadnagar DCP On keshampet Murder Case : డబ్బు, నగల కోసం ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకొని దారుణంగా చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ కేశంపేట మండలంలో జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 36 గంటల్లో హత్యకు సంబంధించిన మిస్టరీని ఛేదించారు. నిందితులు దోచుకున్న బంగారు, వెండి ఆభరణాలను దుకాణంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు.

Brutal Murder Of  Woman In Shadnagar
Shadnagar DCP On keshampet Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 7:50 PM IST

Brutal Murder Of Woman In Shadnagar : రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ కేశంపేట మండలం వేములనర్వ గ్రామ శివారులోని నంబయ్యగుట్ట వద్ద మంగళవారం ఓ గుర్తు తెలియని మహిళ శవం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, 36 గంటల్లో హత్యకు సంబంధించిన మిస్టరీని ఛేదించారు.

పోలీసుల వివరాల ప్రకారం : కేశంపేట మండలం బోధనపల్లి గ్రామానికి చెందిన వెంకటాపురం పార్వతమ్మ రెండు రోజుల క్రితం వేముల నర్వ గ్రామ శివారులోని శివ నంబయ్య గుట్ట చెట్ల పొదల్లో కుళ్లిపోయి, పురుగులు పట్టిన స్థితిలో పోలీసులకు లభ్యమైంది. భర్త చనిపోవడంతో పార్వతమ్మ ఒంటరిగా ఉంటూ వీధి నాటకాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. తనకున్న భూమిని ఇటీవల విక్రయించి కందుకూరు వద్ద ఒక ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు కొంత బంగారం కొనుగోలు చేసి కొంత నగదును తన వద్ద ఉంచుకుంది.

పార్వతమ్మకు కొంత కాలంగా పరిచయమున్న ఫరూక్​నగర్ మండలం మధురాపురం గ్రామానికి చెందిన కుందేళ్ల అంజమ్మ, కేశంపేట మండలం పోమాలపల్లి గ్రామానికి చెందిన పెబ్బే యాదయ్య వీధి నాటకాలకు సహకరిస్తూ ఆత్మీయంగా ఉంటున్నారు. పార్వతమ్మను రూ.50,000 కావాలని ఇద్దరు నిందితులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న విందు చేసుకుందామని ఇరువురు నిందితులు పార్వతమ్మను గ్రామంలోని నంబయ్య గుట్టకు పిలిచారు. అక్కడ మందు సేవించిన అనంతరం టవల్​తో పార్వతమ్మ గొంతుకు చుట్టి చంపేశారు. అనంతరం ఇద్దరూ మోటార్ సైకిల్​పై అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ నెల 17వ తేదీన కేసు నమోదు చేసుకున్న కేశంపేట ఎస్సై రాజ్ కుమార్, తన బృందంతో 36 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో నిందితులను ఇద్దరిని గుర్తించి అరెస్టు చేశారు. అదే విధంగా నిందితుల వద్ద 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు అదే విధంగా నగదు రూ. 1,96,800 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాజేష్ తెలిపారు తెలిపారు. వీటి మొత్తం విలువ రూ. 5,50,000 వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి నగదు రివార్డును డీసీపీ రాజేష్, ఏసీపీ రంగస్వామి చేతుల మీదుగా అందజేశారు.

భర్తనే విలన్‌ - భార్య, ఇద్దరు కుమార్తెలను విషమిచ్చి హతమార్చిన డాక్టర్‌ అరెస్ట్ - Khammam Murder Mystery

రియల్టర్‌ కమ్మరి కృష్ణను చంపించింది కుమారుడే - రూ.25 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య - Shadnagar Realtor KK Murder Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.