ETV Bharat / state

రాష్ట్రంలో నెత్తురోడిన రోడ్లు - ఆరుగురు మృతి - Several People Died in Accidents

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 17 hours ago

Updated : 16 hours ago

Several People Died in Road Accidents Across the State: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలలో పలువురు మరణించారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి క్లీనర్ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఉమ్మడి కృష్టా జిల్లాలో రెండు చోట్లు రోడ్డు ప్రమాదాలు జరగగా నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

several_people_died_in_accidents
several_people_died_in_accidents (ETV Bharat)

Several People Died in Road Accidents Across the State: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొగిలి ఘాట్‌లో 2 లారీలు రాపిడికి గురై అగ్గిరాజుకుంది. అవి డీజిల్‌ ట్యాంకర్‌కు అంటుకుని పెద్ద మంటలు చెలరేగాయి. యూకలిప్టస్‌ లోడుతో వెళ్తున్న లారీ బ్రేక్‌ విఫలం కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. అదే సమయంలో భద్రాచలం వెళ్తున్న చక్కెర లోడు లారీ ఆగి ఉన్న లారీని రాసుకుంటూ వెళ్లింది. ఆ రాపిడిలో నిప్పురవ్వులు చెరలేగాయి. అదే సమయంలో ఆగి ఉన్న లారీ డీజిల్‌ ట్యాంకర్‌ పగిలిపోయింది. ఈ ప్రమాదంలో ఆగిఉన్న లారీలో క్లీనర్ కార్తీక్‌(23) దుర్మరణం పాలయ్యాడు. మృతుడు ఎన్టీఆర్‌ జిల్లా వెంకటాపురం వాసిగా గుర్తించారు. చక్కెర లోడు బోల్తా పడటంతో లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి.

రాష్ట్రంలో నెత్తురోడిన రోడ్లు - ఆరుగురు మృతి (ETV Bharat)

రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూకలిప్టస్‌ లారీ దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చక్కెర లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న పోలీస్‌ బొలెరో వాహనాన్ని తప్పించబోయి మరో లారీ ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. వరుస ప్రమాదాలతో మొగిలి ఘాట్ రోడ్డు బెంబేలెత్తిస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇది మూడో ప్రమాదం కావడం తో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

తిరుమల లడ్డూ వివాదం - వైరల్​ అవుతున్న ప్రకాష్​రాజ్​ వరుస పోస్టులు - Prakash Raj vs Pawan Kalyan

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు: కృష్ణా జిల్లా గన్నవరం శివారులో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖ నుంచి వస్తున్న కారు జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్, మేరీగా గుర్తించారు. గాయలైన మురారి, ఆదాం, ప్రేమమ్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తండ్రి, కుమారుడు మృతి: ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు క్రాస్‌ వద్ద ప్రమాదం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ లారీ ఢీ కొని తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది.

నడిరోడ్డుపై అవేం పనులు? - కడపలో రెచ్చిపోయిన యువకులు - బైక్​పై ప్రేమ జంట రొమాన్స్ - Romance on bike

'పిడుగు పడుతుంటే చెట్ల కిందకు పరుగులు తీస్తున్నారా ! - ఇలా చేయండి' - Visakha Cyclone Warning Center

Last Updated : 16 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.