ETV Bharat / state

భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్​కౌంటర్​ - ఆరుగురు మావోయిస్టులు హతం - 6 MAOISTS KILLED IN TELANGANA TODAY - 6 MAOISTS KILLED IN TELANGANA TODAY

Six Naxals killed in Bhadradri District : భద్రాద్రి జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ కాల్పులు భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెంలో చోటుచేసుకున్నాయి.

Six Maoists killed in Bhadradri District
Six Maoists killed in Bhadradri District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 9:14 AM IST

Updated : Sep 5, 2024, 1:09 PM IST

Maoists Killed in Encounter : అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ భారీ ఎన్​కౌంటర్ గురువారం తెల్లవారుజామున​ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగింది. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం.

గురువారం తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో లచ్చన్న దళానికి చెందిన మావోయిస్టులు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్​ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత లచ్చన్నతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు తూటాలు తగిలి గాయాలు అయ్యాయి. ఓ పోలీసుకు కాలికి తూటా తగలడం, మరో పోలీసుకు పొట్టలో తగిలింది. దీంతో గాయపడిన పోలీసులను భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈనెల 3న జరిగిన ఎన్​కౌంటర్​లో కేంద్ర కమిటీ సభ్యుడు మృతి : మంగళవారం కూడా ఛత్తీస్​గఢ్​ జిల్లా దండేవాడలో జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాస్​ జగన్, అలియాస్​ రణదేవ్​ దాదా మృతి చెందారు. ఇవాళ ఏసోబు మృతదేహం స్వస్థలం టేకులగూడెం చేరుకుంది. ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వామపక్ష పార్టీ నేతలతో పాటు ప్రజాసంఘాల నేతలు తరలివచ్చారు. అనంతరం నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

మావోయిస్టు ఉద్యమ నేతగా అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందు రాడికల్​ యువజన సంఘం నాయకుడిగా పని చేశారు. అక్కడ భూస్వాముల నుంచి పేదలకు వందల ఎకరాలను పంచారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఏసోబు అలియాస్​ రణదేవ్​ దాదా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

తగ్గుతున్న మావోయిస్టుల ప్రాబల్యం : ఒకప్పుడు రాష్ట్రంలో మావోయిస్టు ప్రాభల్యం ఎక్కువగానే ఉండేది. అందులోనూ ఉమ్మడి వరంగల్​, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ ప్రాంతాలు కేంద్ర బిందువులుగా ఉండేవి. అయితే ఇప్పుడు అవి వాటి ప్రాభల్యాన్ని కోల్పోతున్నాయి. ఎందుకంటే ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఎన్​కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్​కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 27 మంది ఉన్నత స్థానాల్లో : మావోయిస్టులకు ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఉద్యమంలో ఓరుగల్లుకు పలువురు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యులుగా, జోనల్​ కమిటీల్లోనూ పలువురు పని చేస్తున్నారు. ఏకంగా ఉమ్మడి వరంగల్​ జిల్లా నుంచి 27 మంది కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అందులో వరంగల్​ కమిషనరేట్​ పరిధిలో 18 మంది, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, ములుగు జిల్లాలో ఐదుగురు ఉన్నారు. ఇప్పటికీ కూడా వీరంతా పార్టీలో ఉన్నట్లు సమాచారం.

భారీ ఎన్‌కౌంటర్‌- 9 మంది మావోయిస్టులు హతం - Chhattisgarh Encounter Today

ములుగు జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు - ఓ మావోయిస్టు మృతి - ENCOUNTER IN MULUGU DISTRICT

Last Updated : Sep 5, 2024, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.