ETV Bharat / state

ఉపాధి కల్పించేవే ఊపిరితీశాయి - విద్యుదాఘాతంతో ఊపిరాడక ఏడేళ్ల బాలుడి మృతి - Boy Died at Home by Short Circuit - BOY DIED AT HOME BY SHORT CIRCUIT

విద్యుదాఘాతంతో ఇంట్లో వ్యాపించిన మంటలు - ఇంట్లోనే ఉన్న ఏడేళ్ల బాలుడు ఊపిరాడక మృతి

SEVEN YEAR BOY DIED BY SHORTCIRCUIT
Seven Years Boy Died in Fire Accident at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 4:29 PM IST

Seven Years Boy Died in Fire Accident at Home : యూకేజీ చదువుతున్న ఓ బాలుడు దసరా సెలవులు కావడంతో ఇంట్లో హాయిగా నిద్రిస్తున్నాడు. తల్లి ఆ సమయంలో పని మీద కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లింది. ఈ క్రమంలో కలత లేని నిద్రపోతున్న ఆ బాలుడిని విధి పగబట్టి అగ్నిప్రమాద రూపంలో బలి తీసుకుంది. తన చుట్టూ మంటలు వ్యాపించగా బయటకు వచ్చేందుకు ఆ బాలుడు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మంటల వల్ల కమ్ముకున్న పొగ ఆ చిన్నారని బలి తీసుకుంది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో చిన్నారి కుటుంబసభ్యలు తీవ్ర ఆవేదనకు గురికాగా గ్రామస్థులను సైతం కలిచివేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అగ్గిడి రాజు, అనిత దంపతులకు కుమార్తె, కుమారుడు సాయికుమార్​(7) సంతానం. వారు రోజు కూలీ పని చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. పరదాలు కూడా అద్దెకు ఇస్తారు. శుక్రవారం సాయంత్రం సమయంలో సాయికుమార్​ ఇంట్లో పడుకుని ఉండగా తల్లి అనిత కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి కరెంట్​ సరఫరా అయ్యే తీగ వదులుగా ఉండడంతో ఆది కాస్త గాలికి ఊగి నిప్పు రవ్వలు చెలరేగాయి. నిప్పులు రవ్వలు ఇంటికి ముందు ఉన్న పరదాలపై పడటంతో మంటలు అంటుకున్నాయి. ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న పరదాలుకు కూడా నిప్పు అంటుకుంది.

గుండెలు పగిలేలా రోదించిన తల్లి : నిద్ర మేల్కొన్న సాయికుమార్​ బయటకు రావడానికి ప్రయత్నించినా మంటలు ఎగిసిపడటంతో బయటకు రాలేకపోయాడు. భయంతో మరో గదిలోకి వెళ్లాడు. అయినా ఇంట్లో వ్యాపించిన పొగ ధాటికి ఊపిరి ఆడలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చి బాలుడిని బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే చిన్నారి విగత జీవుడయ్యాడు. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చిన్నారి తల్లి తన బిడ్డను కాపాడుకుందామని పరిగెత్తుకుంటూ వచ్చినా లోపలికి వెళ్లలేని పరిస్థితి. దీంతో అయ్యో నా బిడ్డా అంటూ గుండెలు పగిలేలా రోదించింది. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ స్వామి వెల్లడించారు.

సరదా కోసం సవారీ చేస్తే - కింద పడేసి బాలుడి ప్రాణం తీసింది - Boy died on buffalo ride

బాలుడి పాలిట యమపాశమైన టైరు - మూత్ర విసర్జన చేస్తుండగా? - boy died hit by a vehicle tire

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.