ETV Bharat / state

ఇంటర్​ పరీక్షల్లో ఫెయిల్​ అయ్యారని ఎనిమిది మంది విద్యార్థుల ఆత్మహత్య - Inter Students Suicide in Telangana - INTER STUDENTS SUICIDE IN TELANGANA

Inter Students Committed Suicide in Telangana : జీవితంలో తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్లాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఒకవేళ చదువులో తక్కువ మార్కులు, ఫెయిల్​ అయినా వెన్నంటి ప్రోత్సహిస్తారు. కానీ కొంతమంది విద్యార్థులు ఫెయిల్యూర్​ను తట్టుకోలేరు. క్షణికావేశంలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రంలో విడుదలైన ఇంటర్​ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యారని ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Inter Students Committed Suicide in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 11:37 AM IST

Updated : Apr 25, 2024, 12:11 PM IST

Inter Students Committed Suicide After Failing Exam 2024 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్​ ఫలితాలు వెలువడ్డాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం వెల్లడించింది. అయితే విద్యాశాఖ మాత్రం ముందు నుంచే ఒక విషయంపై విద్యార్థులను హెచ్చరిస్తోంది. ఒకవేళ ఫెయిల్​ అయినా, మనస్తాపంతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. కానీ వారి సూచన వృథా అయింది. ఇంటర్​ పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచిపోయారు.

  • మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన విద్యార్థి(16) మొదటి ఏడాది ఎంపీసీ చదువుతున్నాడు. ఫలితాలను చూసుకుంటే నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాలేదని తెలిసింది. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
  • మంచిర్యాల జిల్లా నస్పూర్​ మండలానికి చెందిన విద్యార్థిని మొదటి ఏడాదిలో ఎంపీసీ చదువుతోంది. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్​ కావడంతో తీవ్రమనస్తాపానికి గురై, సెల్​ఫోన్​ సిగ్నల్​ రావడం లేదని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి పై అంతస్తులోకి వెళ్లింది. ఎంతకీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు పై అంతస్తుకు వెళ్లి చూడగా ఫ్యాన్​కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
  • మహబూబాబాద్​ మండలం రెడ్యాలకు చెందిన విద్యార్థిని(16) సీఈసీ మొదటి ఏడాది చదువుతోంది. ఒక సబ్జెట్​ ఎకనామిక్స్​లో ఫెయిల్​ కావడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
  • ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఒక విద్యార్థిని(17) మొదటి ఏడాదిలో గణితం ఫెయిల్​ అయింది. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కుమార్తె ఫెయిల్​ అయినట్లు తెలిసి ఫర్వాలేదులే అని ధైర్యం చెప్పానని కానీ ఇలా చేస్తుందనుకోలేదని తండ్రి వాపోయారు.
  • మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ మండలం చిల్కోడుకు చెందిన విద్యార్థిని(17) బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బోటనీలో ఫెయిల్​ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేరని చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
  • సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ పురపాలక పరిధి కొల్లూరులో ఉంటున్న విద్యార్థి(17) ఇంటర్​ ఎంపీసీ పూర్తి చేశాడు. ఫలితాలు చూసుకుని చెరువు గట్టు దగ్గరకు వెళ్లి అక్కడ ఉరేసుకుని, బలవన్మరణానికి పాల్పడ్డాడు.
  • రంగారెడ్డి జిల్లా హైదర్​గూడలో నివాసం ఉండే విద్యార్థిని(16) ఎంపీసీ మొదటి సంవత్సరం ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. మనోవేదనకు గురైన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా తమ నూరేళ్ల జీవితకాలాన్ని ఇలా మనస్తాపం చెంది అర్దాంతరంగా ముగించుకుంటున్నారు.
  • భద్రాచలంలో ఇంటర్​ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని గణితంలో ఫెయిల్​ అయింది. అయితే గత సంవత్సరం ఇంటర్​ ద్వితీయ సంవత్సరంలో ఈ పేపర్​నే ఫెయిల్​ కావడంతో మళ్లీ పరీక్ష రాసింది. అయితే ఇప్పుడు కూడా పరీక్షలో పాస్​ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Board Exam New Rules 2023 : ఇకపై ఏడాదికి 2సార్లు బోర్డ్​ ఎగ్జామ్స్​.. ఇంటర్​లో రెండు లాంగ్వేెజెస్​ నేర్చుకోవాల్సిందే!

ఇంటర్​ ఫలితాలు 2024​ విడుదల - రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి - TS INTER RESULTS RELEASED 2024

Last Updated : Apr 25, 2024, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.