ETV Bharat / state

ఏపీ, తెలంగాణ మధ్య సెమీ హైస్పీడ్‌ కారిడార్ - రైళ్ల వేగం 220 కిలోమీటర్లు

సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో స్టేషన్ల మధ్య అధిక దూరం - సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక స్టేషన్‌ మాత్రమే

Semi High Speed Rail Corridor
Semi High Speed Rail Corridor (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Semi High Speed Rail Corridor : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హైస్పీడ్‌ రైల్ కారిడార్‌ రానుంది. ఇందులో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉండనుంది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక స్టేషన్‌ను మాత్రమే ప్రతిపాదించారు. ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య తక్కువ దూరం 27.76 కిలోమీటర్లు. ఇది సూర్యాపేట-నకిరేకల్‌ మధ్య ఉంటుంది.

గరిష్ఠ దూరం తుని-రాజమహేంద్రవరం మధ్య 88 కిలోమీటర్లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యం చేర్చడం లక్ష్యం కావడంతో స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. సెమీ హైస్పీడ్‌కారిడార్‌లో శంషాబాద్‌-విశాఖపట్నం మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ప్రతిపాదించగా తెలంగాణలో ఆరు, ఏపీలో ఆరు ఉన్నాయి. మరోవైపు కర్నూలు-విశాఖపట్నం మార్గాన్ని కర్నూలు నుంచి శంషాబాద్‌-విశాఖపట్నం మార్గంలో వచ్చే సూర్యాపేట వరకు నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ రూట్‌లో ఎనిమిది అదనపు స్టేషన్లు రానున్నాయి. ఇందులో కర్నూలు మినహా మిగిలిన అన్నీ తెలంగాణలో వస్తాయి.

ఎనిమిదిలో- ఏడు ఇక్కడే : విశాఖపట్నం-శంషాబాద్‌ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ప్రతిపాదిత మార్గంలో మరో కీలక అంశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం - కర్నూలు నగరాలను అనుసంధానం చేసే మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది అదనపు రైల్వే స్టేషన్లు వస్తున్నాయి. వాటిలో ఏడు తెలంగాణలో ఉన్నాయి. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు ప్రాజెక్టుల ప్రాథమిక అంచనా వ్యయం రూ.21వేల కోట్ల పైచిలుకు ఉంటుందని సమాచారం. నవంబర్​ లో రైల్వే బోర్డుకు సమర్పించే ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే నివేదికతో వ్యయంపై స్పష్టతరానుంది. పెట్‌ సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం లభించాక సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు అధికారులు తుది సర్వే నిర్వహించనున్నారు.

వయా మునుగోడు నియోజకవర్గం : శంషాబాద్‌-విశాఖపట్నం సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే విజయవాడ జాతీయ రహదారిలోని ఎల్బీనగర్​ - చౌటుప్పల్‌ మార్గంలో కాకుండా శంషాబాద్‌ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌కు వెళ్తోంది. జాతీయరహదారిలోని చౌటుప్పల్‌ నుంచి 24 కిలోమీటర్లకు లోపలకు గట్టుప్పల్‌ ఉంటుంది. చిట్యాల వెస్ట్, నకిరేకల్, సూర్యాపేట జంక్షన్‌ ప్రతిపాదిత స్టేషన్లూ ఎలైన్‌మెంట్‌లో నేషనల్ హైవేకి కొంత దూరంలో ఉండనున్నాయి. సెమీహైస్పీడ్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ జాతీయ రహదారికి దూరంగా ఉండడానికి భూసేకరణ చిక్కులు, భూముల ధరలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ చిన్న రాష్ట్రమని కేంద్రంలో ఓ కీలక ప్రజాప్రతినిధి తెలిపారు. కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా ఉందని ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే విజయవాడకు మెట్రో రైలు - కేంద్రానికి ప్రతిపాదనలు

ఏపీలోని ఆ మూడు రైలు మార్గాల్లో 'కవచ్'​ - 2027 నాటికి పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.