ETV Bharat / state

నిజామాబాద్​లో దారుణం - నాలుగేళ్ల కుమార్తె గొంతు నులిమి చంపిన తండ్రి - man Killed Daughter in Nizamabad - MAN KILLED DAUGHTER IN NIZAMABAD

Man kills Daughter in Nizamabad : తన భార్య మొదటి భర్తకు పుట్టిన పాపను ఓ కసాయి తండ్రి గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ మాక్లూరు మండలం ధర్మోరాలో జరిగింది.

Father kills Four year Daughter in Nizamabad
Man kills Daughter in Nizamabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 9:55 PM IST

Father kills Four year Daughter in Nizamabad : కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని ఆ పసి పాపపై కనికరం లేకుండా ఆ కిరాతకుడు గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారక దుర్ఘటన నిజామాబాద్​ జిల్లాలోని మాక్లూర్ మండలంలోని ధర్మోరా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాక్లూర్ మండల కేంద్రంలోని ధర్మోరా గ్రామానికి చెందిన ఈర్నాల అరుణ్ ఏడాది క్రితం నిజామాబాద్ సుభాశ్​ నగర్​కు చెందిన వీరమ్మ కుమార్తె సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సునీతకు మొదటి భర్తకు పుట్టిన బిడ్డ లక్కీ(4) అనే చిన్నారి ఉంది.

మొదటి భర్తకు పుట్టిన పాప ఉండొద్దంటూ గొడవ : అరుణ్ వివాహ సమయంలో సునీతతో పాటు లక్కీని కూడా తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో అరుణ్ పాప లక్కీని తన ఇంట్లో వద్దని తరచూ భార్యతో గొడవ పడేవాడు. గత 3 నెలల క్రితం కూడా పాప చేయి విరగ్గొట్టాడు. అప్పటి నుంచి పాపను సునీత నిజామాబాద్​లోని సుభాశ్​నగర్​కు చెందిన ఆమె తల్లి వీరమ్మ దగ్గర ఉంచింది. అయితే బుధవారం సునీత తన కుమార్తెను చూడాలని భర్త​కు చెప్పడంతో అందుకు అరుణ్ నిజామాబాద్ నుంచి పాపను తీసుకుని ధర్మోరా వెళ్లాడు.

పాప లక్కీ నిద్రిస్తున్న సమయంలో తల్లి సునీత స్నానానికి వెళ్లింది. ఈ క్రమంలో అరుణ్ ముగ్గురు వ్యక్తుల సాయంతో నిద్రిస్తున్న కుమార్తె గొంతు నులిమి హత్య చేశాడని తల్లి వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్​ కుమార్ తెలిపారు.

తీవ్రంగా గాయపర్చి - ఆపై ఉరి వేసి - వివాహేతర బంధానికి అడ్డొస్తుందని మైనర్​ బాలికపై కన్నతల్లి హత్యాయత్నం - Mother Tried to kill her Daughter

కుమార్తెకు మానసిక సమస్య - ఎంతకీ నయం కాకపోవడంతో హతమార్చిన తల్లిదండ్రులు - Parents killed daughter in Sircilla

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.