Madanapalle Fire Accident Incident Updates: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రెండోరోజు విచారణ కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. సోమవారం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మదనపల్లి వచ్చి మూడు గంటల పాటు విచారణ చేశారు. రెండోరోజు మంగళవారం యథావిధిగా విచారణ కొనసాగుతోంది.
డివిజన్‌లోని 11 తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. రికార్డులు స్వాధీనం చేసుకుని సబ్ కలెక్టరేట్‌కు అధికారులు తరలిస్తున్నారు. దస్త్రాల దగ్ధం ఘటనపై విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మంత్రి అనగాని, డీజీపీ, సీఐడీ చీఫ్‌తో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యక్రమంలో దస్త్రాల దహనం ఘటనపై సమీక్షించారు. సీఎంకు ఇప్పటి వరకూ చేసిన విచారణను డీజీపీ నివేదించారు.
ఉదయం పోలీసులతో మరోసారి డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్షించారు. దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశించారు. అనంతరం విజయవాడకు డీజీపీ చేరుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి మరికొందరు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాను వెళ్లమని ఆదేశాలు జారీ చేశారు. ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీ జెన్‌కో సీఎమ్డీలను కూడా మదనపల్లెకు వెళ్లి తమ శాఖలకు సంబంధించిన అంశాలపై విచారణ జరపాలని స్పష్టం చేశారు.
నాగపుర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ సంస్థ నిపుణులను ప్రభుత్వం పిలిపిస్తోంది. దస్త్రాలు దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం చిన్న ఆధారం దొరికినా నిందితులను పట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం దహనం వెనక పెద్దిరెడ్డి పాత్ర! - Madanapalle Sub Collector Office