Second Day Nominations in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కోలాహలం కొనసాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా తరలివచ్చి నామపత్రాలు సమర్పిస్తున్నారు. అభ్యర్థులు ర్యాలీలు, బల ప్రదర్శనతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. నామినేషన్లో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
రాజ్యసభ నామినేషన్ల పరిశీలన పూర్తి - ఒకటి తిరస్కరణ
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం సుగురు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ అనంతరం సతీమణి వసుంధర దేవితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామపత్రాలు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
శ్రీకాకళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్ధిగా మామిడి గోవిందరావు తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం పార్టీ కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో పాతపట్నంలో భారీగా రాలీ నిర్వహించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీజేపీ, జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు
విజయవాడ లోక్‌సభ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కేశినేని చిన్ని నేడు నామినేషన్ వేయనున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. కేరళ డప్పుల మోతలు, సంప్రదాయ నృత్యాలతో వినాయకుడి గుడి పరిసరాలు కోలాహలంగా మారాయి. చిన్ని అభిమానులతో ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేయనున్నారు.
కృష్ణాజిల్లా పెనమలూరులో తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పోరంకిలోని పార్టీ కార్యాలయం నుంచి పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయానికి ఆయన ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ ర్యాలీలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థి సీహెచ్ బాబురావు నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. పైపుల రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. బాబురావుకు మద్దతుగా ఆటో కార్మికుల సంఘం ప్రజా సంఘాలు ర్యాలీలో పాల్గొన్నారు.
అణువణువు తనిఖీలు ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు- పోలీసుల అత్యుత్సాహం - People Problems in kanigiri
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ వేశారు. తాడిపత్రిలోని జేసీ అస్మిత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో ర్యాలీగా తరలివెళ్లారు. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆర్వో కార్యాలయంలో అస్మిత్ రెడ్డి నామినేషన్ వేశారు.
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేశారు. పదోసారి పోటీ చేస్తున్న ఆయన అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. బాపట్ల జిల్లా అద్దంకిలో తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ వేయనున్నారు. కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీగా ఆయన నామినేషన్ వేసేందుకు తరలివెళ్లారు.
హిందూపురం టీడీపీ అభ్యర్థిగా బాలయ్య నామినేషన్ - BALAKRISHNA NOMINIATION
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ దాఖలు చేశారు. మొదట కోటసత్తెమ్మ ఆలయం సమీపంలోని పార్టీ కార్యాలయం నుంచి నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, నియోజకవర్గ ఇన్చార్జి బీవీఎస్ఎన్ ప్రసాద్, మూడు పార్టీల కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీగా బరిలో ఉన్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. 2019లో కూడా ఇక్కడ నుంచే ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి కూడా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీలుగా విశిష్ట సేవలందించిన కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోశయ్య లాంటి గొప్ప నాయకులు ఆదర్శమని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
తొలిరోజు జోరుగా నామినేషన్ల ప్రక్రియ - భారీ ర్యాలీలతో తరలివస్తున్న నేతలు - ELECTION NOMINATIONS
పల్నాడు జిల్లాలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం మాచర్లలో తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు ఇరువూరు ఒకేరోజు నామినేషన్లు వేయనుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాచర్లలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అనంతరం తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆర్వో కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేయగా అదే సమయంలో నామినేషన్ వేయటానికి వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
వినుకొండలో తెలుగుదేశం అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరెడ్డి ఆయన నామినేషన్‌ను బలపరచగా వీఆర్వోకు నామపత్రాలు అందజేశారు. అంతకు ముందు వినుకొండ పాత శివాలయంలో జీవీ దంపతులు పూజులు చేశారు. ఈ నెల 24న జీవీ ఆంజనేయులు రెండో సెట్ నామిషన్ దాఖలు చేయనున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమరనాథరెడ్డి ఈనెల 22న తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 22వ తారీఖు ఉదయం స్థానిక ఓం శక్తి ఆలయం వద్ద పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టడం జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ నామినేషన్ వేశారు. శ్రావణ్ కుమార్కు మద్దతుగా కూటమి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ - తొలి రోజు 229 దాఖలు - Leaders filed nominations