ETV Bharat / state

ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే జిమ్‌కు వెళ్లనక్కర్లేదు! - ఇంట్లో కూర్చునే కొవ్వును వెన్నలా కరగదీయొచ్చు!

వ్యాయామానికి ప్రత్యామ్నయంగా మాత్రలు - ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్తలు

Scientist Invented Pills in Place Of Exercise to Lose Weight
Scientist Invented Pills in Place Of Exercise to Lose Weight (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : 3 hours ago

Scientist Invented Pills in Alternate To Exercise to Lose Weight : 'కష్టపడకుండా కూర్చుంటే ఒంట్లో కొవ్వు కరగదు. వ్యాయామం చేయాలి. చక్కని ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు వ్యాయామ నిపుణులు. కొన్నిసార్లు ఎంత చేసినా మార్పు కనిపించట్లే అనిపిస్తుంటుంది. 'అరే.. ఇంత చేసినా బరువు తగ్గట్లే ఏంటి?' అని నిరాశ కలుగుతుంది. ఇలాంటివి వినడాలు, ప్రయత్నించడాలు ఇక అవసరం లేదు. వాటికి తెర దింపడానికి ఓ వ్యాయామ మాత్ర వచ్చింది. అవును నిజమే. ఆహారానికి ప్రత్యామ్నాయంగా కొన్ని మాత్రలు వచ్చినట్టు, ఇప్పుడు వ్యాయామం అవసరం లేకుండా అదే స్థాయి ఫలితాన్ని ఇచ్చే బిళ్లను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. 10 కిలోమీటర్లు పరుగు పెడితే ఎంత ప్రయోజనం ఉంటుందో, అంత లాభం వస్తుందంటా ఈ మాత్రతో.

సమానంగా పని చేస్తోంది : లేక్‌ అనే ఈ మాత్రను డెన్మార్క్‌లోని ఆరూస్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు. మనం బాగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో లాక్టేట్, కీటోన్స్‌ ఏర్పడి, అవి ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను నియంత్రిస్తాయి. ఈ లేక్‌ మాత్రం ఆ పరిణామాన్నే శరీరంలో కృత్రిమంగా కల్పిస్తుంది. అందుకే లాక్టేక్‌, కీటోన్స్‌లోని తొలి అక్షరాలని తీసుకుని ఈ మందు బిళ్లకు లేక్ అని పేరు పెట్టారు.

సండే "మారథాన్​"లో పాల్గొనాలనుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే ఆరోగ్యానికి నష్టం తప్పదట!

వారికి మాత్రమే : ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మాత్ర వ్యాయామం చేయగలిగేలా ఉండి, చేయలేని వారి కోసం కాదండోయ్. నరాలు, గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతూ, వ్యాయామాలు చేయలేని వారి కోసం మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాయామం చేయగలిగే వారు క్రమం తప్పకుండా కచ్చితంగా వ్యాయామమే చేయాలని సూచిస్తున్నారు.

ఇటీవల కాలంలో జీవన శైలి కారణంగా సమయానికి సరిగ్గా తినక, అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అలా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. వయస్సులో ఉండి, వ్యాయామం చేయగలిగిన వారైతే బరువును ఈజీగా తగ్గించుకుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి సవాలే. అలాంటి వారికి ఈ పిల్‌ ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

వ్యాయామం లేకుండా బరువు తగ్గాలా? - మీరు తినే ఆహారంలో ఈ మార్పులు చేస్తే చాలట!

ఎముకలు బలంగా ఉండాలా? రోజూ ఈ వ్యాయామాలు చేస్తే స్ట్రాంగ్​ అవుతాయ్​! - bone density exercises

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.