Teachers Promotion in Warangal : రాష్ట్రంలోని మల్టీ జోన్-1(వరంగల్) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏ క్షణమైనా వెల్లడి కావచ్చని సమాచారం. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. భాషా పండితులు, పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ) కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికిపైగా భాషా పండితులు, పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు, పీఈటీల 15 ఏళ్ల కల ఫలిస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు.
SGT Teachers Transfer in Telangana : మల్టీ జోన్-1లోని 19 జిల్లాల్లో సుమారు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకోనున్నారు. దీంతో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషా పండిట్లుగా, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. వారిలో నాలుగో వంతు మందికి రెండు ఇంక్రిమెంట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జోన్ పరిధిలో ఈ నెల 8 నుంచి బదిలీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 22 వరకు జరుగుతోందని ప్రకటించింది.
టీచర్ బదిలీల షెడ్యూల్ విడుదల - ఎప్పటినుంచంటే - Teachers Transfer Schedule
Multi Zone 2 Teachers Transfer Schedule 2024 : మరో రెండు మూడు రోజుల్లో మల్టీ జోన్-2(హైదరాబాద్)లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు లభించనున్నాయి. ఈ జోన్ పరిధిలో ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనుంది. టెట్‌తో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పదోన్నతులు చేపడుతున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. గతంలో కోర్టు కేసులు ద్వారా ఎక్కడైతే ఈ బదిలీ ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడ నుంచే మళ్లీ ప్రక్రియను ప్రారంభిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.