ETV Bharat / state

'వైఎస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్యశాఖకు అనారోగ్యం- పూర్తిగా ప్రక్షాళన చేస్తాం' - health minister Satya Kumar Yadav - HEALTH MINISTER SATYA KUMAR YADAV

Satya Kumar Yadav takes charge as Health Minister : రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖకే అనారోగ్యం తెచ్చిందని విమర్శించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సత్యకుమార్‌ స్పష్టం చేశారు.

Satya Kumar Yadav takes charge as Health Minister
Satya Kumar Yadav takes charge as Health Minister (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 16, 2024, 4:56 PM IST

Satya Kumar Yadav Takes Charge as Health Minister : ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.

ఐటీ హబ్‌గా విశాఖ, ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా తిరుపతి- అధికారులతో మంత్రి లోకేశ్​​ సమీక్ష

గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరి చేస్తామని స్పష్టం చేశారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాని వెల్లడించారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స, నివారణకు చర్యలు తీసుకుంటాం, వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిమ్స్‌ తరహాలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

'వైఎస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్యశాఖకు అనారోగ్యం- పూర్తిగా ప్రక్షాళన చేస్తాం' (ETV Bharat)

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖకే అనారోగ్యం తెచ్చిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి అక్రమాలతో అనారోగ్యం పాలైందని, జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతామని, అన్ని అంశాలపైనా శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. అలాగే 18 ఏళ్ల లోపు వారి ఆరోగ్యం కోసం రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమంపై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్ చేసే దస్త్రంపై మరో సంతకం చేశారు. నాడు నేడు, ఆరోగ్య శ్రీ లో అనేక అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ,అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు మహిళా 'వీరాభిమాని' - ఐదేళ్ల తర్వాత పుట్టింటికి

ఆరోగ్య శ్రీ పేరిట కొన్ని ఆస్పత్రులకు, దళారులకు ప్రజాధనం దారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఆస్పత్రులకు రూ. 1500 కోట్ల నిధులు ఇవ్వకుండా బకాయి పెట్టారని విమర్శించారు. వైద్యం కోసం కేంద్రం నుంచి వచ్చిన 60 శాతం నిధులనూ గత ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. వైద్య రంగం కోసం రాష్ట్రం తన వంతు వాటా ఇవ్వకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందన్నారు. వైద్య కళాశాలల ఏర్పాటులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటినీ సరిచేస్తామని, వైద్యంలో ఏపీని మోడల్ గా తీర్చిదిద్దేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎయిమ్స్ తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎయిమ్స్ లో అందించే సేవలపై అధ్యయనం చేసి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం అన్ని చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ స్పష్టం చేశారు.

దివ్యాంగుడు మనోజ్‌కు రూ.3లక్షలు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.