Sanitation Problem in Vijayawada : ఎన్నికల హడావుడిలో విజయవాడ నగరుపాలక అధికారులు సమస్యలను గాలికొదిలేశారు. నాలుగు వారాలుగా కార్పొరేషన్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండడం, మేయర్, డిప్యూటీ మేయర్లు, పాలకవర్గ సభ్యులు ఆయా పార్టీల తరపున ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో విజయవాడలో పాలన స్తంభించింది. దీంతో అనేక సమస్యలు నగరవాసులను చుట్టుముట్టాయి.
Drinking Water Proplem in Vijayawada : తాగునీటి కోసం బెజవాడ నగర శివారు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటిని సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ వద్ద అధికారుల పర్యవేక్షణ లోపించింది. ఇక్కడ నీటి శుద్ధి సరిగా లేనందున మురుగునీటినే పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గిపోయింది. నది నుంచి వచ్చే పాచి పట్టిన నీటిని తగిన ప్రమాణాలకు అనునుగుణంగా శుద్ధి చేసే పరిస్థితి లేకుండా పోయింది.
చెంతనే కృష్ణమ్మ - అయినా తప్పని తాగునీటి తిప్పలు - Vijayawada Water Issue
Vijawada Water Issue : ఎన్నికల సాకుతో అధికారులు, పాలకవర్గం సభ్యులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలును విస్మరించారు. బోర్ల మరమ్మతులు, లీకవతున్న మంచినీటి పైప్‌లైన్ల రిపేర్లు చేయలేదు. గత్యంతరం లేక పైప్‌లైన్ల ద్వారా వచ్చిన కలుషిత నీటినే ప్రజలు తాగుతున్నారు. జక్కంపూడి, కండ్రిక, వాంబేకాలనీ, రాజరాజేశ్వరి పేట, పటమట తదితర ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఈ అవకాశాన్ని అనుమతులు లేకుండా పుట్టుకొచ్చిన ప్రైవేటు మంచినీటి ప్లాంట్ల ద్వారా కొంత మంది సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు.
గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కడప నగర వాసులు - సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళన - Drinking Water Problem
Sewage Problem in Vijayawada : నగర పాలక అధికారులు మురికి కాలువల్లో పూడికతీత పనులనూ పక్కన పెట్టేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారై బందర్, ఏలూరు, రైవస్, బుడమేరు కాల్వల పక్కన నివాసముంటున్న వేలాది కుటుంబాలకు దోమల బెడద తప్పడం లేదు. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
వాంబే కాలనీ వాసుల వ్యధ - ఈ నీరు తాగేదెలా? - Drinking Water Problem