Sangareddy Library Issues : సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలోని పుస్తకాలను వినియోగించుకొని ఇప్పటి వరకు అనేక మంది వివిధ స్థాయిలో సర్కారు కొలువులు సాధించారు. ఇక్కడ పేద, మధ్య తరగతి వారు ఎక్కువగా చదువుకుంటారు. కానీ కొంతకాలంగా గ్రంథాలయం (Library) సమస్యలకు నిలయంగా మారింది. అపరిశుభ్రమైన వాతావరణం సహా కూర్చునేందుకు కుర్చీలు కరవయ్యాయని, పుస్తకాల భారం తమపై పడడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి నానా ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లకు వెళ్లి తిని వచ్చేందుకు చాలా సమయం వృథా అవుతుందని అంటున్నారు. సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
పిల్లల కోసం బొమ్మల లైబ్రరీ- యాప్లో ఆర్డర్ చేస్తే ఉచితంగా హోమ్ డెలివరీ!
"సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. పుస్తకాల ఎడిషన్ మార్పుల వల్ల గ్రంథాలయంలో సిబ్బంది కొత్త వాటిని అందుబాటులో ఉంచలేక పోతున్నారు. చాలా సార్లు సమస్యను యాజమాన్యానికి తెలియజేశాం. ఇక్కడ ప్రస్తుతం పాత ఎడిషన్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అక్షయ పాత్ర ద్వారా భోజనం లభించేది." - విద్యార్థులు
Library Problems In Sangareddy : గ్రంథాలయంలో ప్రతిరోజు దాదాపు 150 నుంచి 200 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారని డిప్యూటీ లైబ్రేరియన్ తెలిపారు. విద్యార్థులు (students) కోరినట్లుగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని, ఇతర సౌకర్యాలపై సైతం దృష్టి సారించామని అధికారులు చెబుతున్నారు. సర్కారు కొలువు సాధించాలనే తపనతో కష్టపడే కొందరికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలుస్తున్నాయి.
"ప్రభుత్వం జారీ చేసిన నోటిఫీకేషన్ అనుగుణంగా పుస్తకాలను అందుబాటులో ఉంచాం. ఉన్న పుస్తకాలతో వారు సంసిద్ధం అవుతున్నారు. మార్కెట్లో ఉన్న పుస్తకాలకు పాఠకుల నుంచి డిమాండ్ ఉన్న వాటిని తెప్పిస్తున్నాం."-వంశీకృష్ణ, డిప్యూటి లైబ్రేరియన్
నేటి విద్యార్థులే రేపటి అధికారులు. పోటీ పరీక్షల సమయంలో గ్రంథాలయం వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తే రేపు వారి ఉద్యోగం సాధించి పేద విద్యార్థులకు అండగా నిలుస్తారు. సర్కారు కొలువు సంపాదించాలన్న కసితో కష్టపడి చదువుకోవడానికి ముందుకెళితే, వారిలో కొంత మందిని ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలుస్తున్నాయి. అలాంటి వారికి గ్రంథాలయాలు అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తే మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.
Summer Camp in Sangareddy : చిన్నారుల కోసం 'మన లైబ్రరీ' వేసవి శిబిరం.. ఎక్కడో తెలుసా..!