ETV Bharat / state

సంగారెడ్డి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 6కు చేరిన మృతులు - బాధితులకు పరిహారం చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ - Sangareddy Chemical Factory Deaths - SANGAREDDY CHEMICAL FACTORY DEATHS

Sangareddy Chemical Factory Blast Update : సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటి వరకు 6కు చేరగా, గాయపడిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందన్న ఆయన, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Harish Rao Reaction on Reactor Blast in Sangareddy
Sangareddy Chemical Factory Update
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 1:48 PM IST

Sangareddy Chemical Factory Blast Update : సంగారెడ్డి జిల్లాలోని రసాయన పరిశ్రమలో బుధవారం జరిగిన పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, నలుగురు కార్మికులు మృతి చెందగా, తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయ సిబ్బంది గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్‌గా గుర్తించారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం ఆయిల్‌ బాయిలర్‌ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

Six killed in Sangareddy Chemical Factory Fire Accident : పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్‌ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్‌ రవిశర్మ, కార్మికుల్లో తమిళనాడుకు చెందిన దయానంద్‌, విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం, మధ్యప్రదేశ్‌కు చెందిన సురేశ్​ పాల్‌ మృతి చెందారు. చందాపూర్‌ గ్రామానికి చెందిన విష్ణును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. తాజాగా శిథిలాల కింద మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. గాయాలైన 16 మందిని అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. క్షతగాత్రులను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు.

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం - పరిశ్రమ డైరెక్టర్ సహా ఐదుగురి మృతి - Fire Accident in Sangareddy

Harish Rao Reaction on Reactor Blast in Sangareddy : ప్రమాద ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్న బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫోన్ చేసి మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి అధికారులను కేటాయించి ప్రత్యేక అంబులెన్స్‌లలో ఉచితంగా తరలించాలని కలెక్టర్‌ను కోరారు. అంబులెన్స్‌లలో మృతదేహాలు చెడిపోకుండా కూలర్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరారు.

"ఈ ఘటన వెనుక ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. సరిగ్గా పరిశీలన చేయకపోవడం వల్ల, అమాయకులైన కార్మికులు చనిపోయారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ ఎవరూ బాధ్యత వహించడానికి లేరు. వాళ్లను గాలికి వదిలేశారు. ఎంత మందికి గాయాలయ్యాయి. ఎన్ని మరణాలు సంభవించాయన్న విషయాలు కూడా సరిగ్గా చెప్పడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యాజమాన్యంపై, నిందితులపైన చర్యలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం చెల్లించాలి." - హరీశ్‌ రావు, మాజీ మంత్రి

రియాక్టర్‌ పేలుడులో ఆరుకు చేరిన మృతుల సంఖ్య బాధితులకు పరిహారం చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్

టైలర్​ షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి - Maharashtra Fire Accident

బాధితులందరికి పరిహారం చెల్లించాలి : యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని, మృతుల కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఎక్స్‌గ్రెషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన వారిని గాలికి వదిలేసార,ని సాయం కోరుతున్న వారిపై దురుసుగా ప్రవర్తించడాన్ని తాము ఖండిస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగటం దురదృష్టకరమని బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలమైందన్నారు.

గోదాంలో భారీ అగ్నిప్రమాదం - ఆహుతైన 12.88 లక్షల గన్నీ బ్యాగులు - రూ.కోట్లలో నష్టం - Gunny Bags Godwon Fire accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.