RTC not allowed Animals in Buses to Medaram : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు చెందిన గొర్రెలు, మేకలు, కుక్క పిల్లలకు బస్సుల్లో అనుమతి ఇవ్వకపోవడంతో బస్టాండ్‌లోని ఆర్టీసీ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. బస్సులో ఎక్కిన జంతువులకు ఆర్టీసీ టికెట్ తీసుకోమన్నా వినకుండా వాటికి వర్తించదు అంటూ దింపేశారని ప్రయాణికులు మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని స్థానిక బస్టాండ్‌లో నాచారం గ్రామానికి చెందిన మేడారం జాతరకు వెళ్లే భక్తులు కుటుంబసభ్యులతో సమ్మక్క సారలమ్మలకు మొక్కుకున్న గొర్రె పిల్లలను సైతం తీసుకొని వచ్చారు.
ఈ క్రమంలో గొర్రె పిల్లలతో ఆర్టీసీ బస్సులో ఎక్కిన ప్రయాణికులను ఆ సంస్థ అధికారులు అడ్డుకొని, బస్సులో జంతువులకు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పారు. జంతువులను ప్రైవేటు వాహనాల ద్వారా తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో కొంతసేపటి వరకు భక్తులు, ఆర్టీసీ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మొక్కులు చెల్లించుకోవడానికి తీసుకెళుతున్న గొర్రె పిల్లను అడ్డుకోవడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఏటా మొక్కులు చెల్లించేందుకు మేడారానికి గొర్రె పిల్లలతో సహా ఆర్టీసీలో బస్సులో వెళ్లేవారమని, కానీ ఇప్పుడు అధికారులు అడ్డుకుంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము జాతరకు ఎలా వెళ్లాలని గొడవకు దిగారు. ఇదే క్రమంలో మేడారంకు వెళ్లేందుకు ఓ కుటుంబ సభ్యలు, తమ కుక్కపిల్లతో బస్టాండ్‌కు చేరుకోగా ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇంట్లో అందరం మూడు రోజులు జాతరకు వెళ్తున్నామని, ఈ క్రమంలో కుక్క పిల్లను ఒంటరిగా వదిలి వెళ్తే చనిపోయే అవకాశం ఉందని వాపోయారు.
'గొర్రెలను, మేకలను బస్సులో ఎక్కించుకోవడం లేదు. జాతరకు మేము ఎలా వెళ్లాలి. వాటికి కూడా టిక్కెట్ తీసుకోమని చెప్పినా పట్టించుకోవడం లేదు' - ప్రయాణికుడు
No Animals are allowed in Medaram Buses : ప్రతిసారి కుటుంబ సమేతంగా మేడారానికి వెళ్లే వాళ్లమని అప్పుడు కూడా మేకలను, గొర్రె పిల్లను, కోళ్లను మొక్కుబడిగా వెంట తీసుకొని పోయే వాళ్లమని ప్రయాణికులు తెలిపారు. ఇప్పుడు ఇలాంటి పద్ధతి తీసుకొచ్చి భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆర్టీసీ అధికారులు దీనిని గమనించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు ప్రయాణికులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో జంతువులకు ఎలాంటి పర్మిషన్ లేదని, మేడారం వెళ్లే భక్తులు గమనించి ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్లాలని సూచించారు.
కోళ్లను గానీ, మేకలను గానీ తీసుకు రాకండి బస్సుల్లో జంతువులకు నిషేధం ఉంది. వాటిని బస్సులో అనుమతించం' - లక్ష్మినారాయణ, భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్
మేడారం ఎఫెక్ట్‌తో రెగ్యులర్ సర్వీసుల్లో తగ్గింపు - సాధారణ ప్రయాణికులు సహకరించాలని సజ్జనార్ రిక్వెస్ట్వ
నదేవతల జనజాతరకు వేళాయే - నేడు మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న పయనం