RTC Bus Hit Auto In Anantapur District Two Died : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాకెట్ల వద్ద రోడ్డుపై ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాకెట్లకు చెందిన బూసేప్ప (55), హనుమక్క (72) గా గుర్తించారు.
వీరిద్దరూ కూరగాయలు కొనుగోలు చేయడానికి ఆటోలో ఉరవకొండకు వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఉరవకొండ పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.