ETV Bharat / state

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - పలువురికి గాయాలు - RTC Bus Accident in Peddapalli

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 5:55 PM IST

Updated : Apr 5, 2024, 7:07 PM IST

RTC Bus Accident in Peddapalli District : పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై, చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి మంథనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దుబ్బపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

RTC Bus Crashed into Bushes in Peddapalli
RTC Bus Accident in Peddapalli District

RTC Bus Accident in Peddapalli District : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద లారీని తప్పించబోయి మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు స్వల్ప గాయాల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దుబ్బపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులందరినీ ప్రైవేటు వాహనాల్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్​తో పాటు కండక్టర్ కూడా స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - పలువురుకి గాయాలు

Last Updated : Apr 5, 2024, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.