Streams Overflow Due To Rains in Bhupalpally : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మోరాంచ వాగు, చలివాగు, మానేరువాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘనపురం మండల కేంద్రానికి సీతారాంపురం గ్రామాల మధ్య మోరంచ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లిలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టేకుమట్ల మండల కేంద్రం నుంచి రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. భూర్ణపల్లి - కిష్టంపేట గ్రామాలతో పాటుగా గర్మిల్లపల్లి - ఓడేడు గ్రామాలకు సంబందాలు తెగిపోయాయి. వాగులో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు కొట్టుకుపోగా భూపాలపల్లి జిల్లా - పెద్దపల్లి జిల్లాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇక ఘనపురం- సీతారాంపురం గ్రామాల మధ్య మోరంచ వాగు ప్రవహించడంతో మండల కేంద్రానికి రావడానికి సీతారాంపురం, బంగ్లా పల్లి, అప్పయ్యపల్లి, కొండాపూర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. టేకుమట్ల - రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్య చలివాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
'ముసురు' పట్టిన తెలంగాణ - మరో 5 రోజుల పాటు పొంచి ఉన్న వరుణుడి ముప్పు - heavy rain fall in telangana
భూర్ణపల్లి- కిష్ఠంపేట గ్రామాల మధ్య మనేరు వాగు ప్రవహించడం పట్ల తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయి భూపాలపల్లి జిల్లా - పెద్దపెల్లి జిల్లాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గర్మిళ్లపల్లి - ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయి... భూపాలపల్లి జిల్లా - పెద్దపెల్లి జిల్లాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మోవైపు భుపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లో రోడ్లన్నీ బురద మయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయయం ఏర్పడగా సింగరేణి సంస్థకు సుమారు రోజుకు 4కోట్ల రూపాయల పైగా మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్లన్నీ బురదమయం కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపేశారు. పెద్ద పెద్ద మోటార్ల సాయంతో నీరును బయటకు తీస్తూ బొగ్గు ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చెరువులు కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికులు ఇండ్లకే పరిమితమయ్యారు. పలు గ్రామాల్లో చెరువులు నిండి మత్తడి పోస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.