Road Accident in Tirupati District Today : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కలకడ నుంచి చెన్నైకి టమాటాల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Bhakarapet Road Accident Today : పోలీసులు, స్థానికులు మూడు గంటల పాటు శ్రమించి కారుపై నుంచి కంటైనర్ తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంతో కనుమరహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
అంబటివలసలో ద్విచక్ర వాహనాలు ఢీ - ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - Two People Dead in Accident