Road Accident in Annamayya District: అతిగా మద్యం సేవించి కారును నడిపి ప్రమాదాన్ని గురి చేసిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగింది. ఆదివారం రాత్రి బెంగళూరు రోడ్డు బార్ల పల్లె వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రోడ్డు పక్కన ఉన్న ఇద్దరిని ఢీకొట్టి: కర్ణాటక నుంచి స్కార్పియో వాహనంలో మదనపల్లి పట్టణం రామారావు కాలనీ చెందిన ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. వీరంతా మద్యం సేవించి ఉన్నారు. కర్ణాటక సరిహద్దు దాటి బార్లపల్లె చేరుకున్నారు. ఇక్కడ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు.
కారులోని ఆరుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి: అనంతరం అతివేగంగా ముందుకు వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరిని మదనపల్లి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. యువకులు మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన పాడి రైతులు చంద్ర (50), సుబ్రహ్మణ్యం (62) మృతి చెందారని చెప్పారు. వారికి న్యాయం చేయాలని బార్లపల్లెలో నిరసనకు దిగారు. ఘటనాస్థలిని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, పోలీసులు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఏడుగురు దుర్మరణం- మరో ఏడుగురు సీరియస్!
Fire Accident in Tirupati: తిరుపతి నగరంలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని వీవీ మహల్ రోడ్డు సమీపంలోని ఓ చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దుకాణం పూర్తిగా దగ్ధం అయ్యింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాదాపు 25 లక్షల వరకు ఆస్తి నష్టం కలిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.