Seven Died in Road Accident in East Godavari District : ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ లారీ వెళుతోంది. ఆరిపాటిదిబ్బలు- చిన్నాయిగూడెం రహదారిలోని చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంట బోదెలోకి లారీ దూసుకెళ్లి తిరగబడింది.
వాహనంపై 9 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. లారీ తిరగబడడంతో జీడిపిక్కల బస్తాలు కార్మికులపై పడి ఏడుగురు చనిపోయారు. మృతులు సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌గా పోలీసులు వెల్లడించారు. స్థానికులు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.
పరారీలో మినీ లారీ డ్రైవర్ : సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు. సంఘటన అనంతరం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అనారోగ్యంతో తండ్రి - ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం - ఘటనలో ఇద్దరు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు, వాటర్ హీటర్ షాక్‌తో యువకుడు మృతి