ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​కు త్వరలోనే మోక్షం - 3 నెలల్లో దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు - Ponguleti on Lrs Regularization

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 6:42 PM IST

Updated : Aug 3, 2024, 9:13 PM IST

Ponguleti Revoew Meet On LRS Regularisation : రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్ ఉన్న ఎల్​ఆర్​ఎస్‌ దరఖాస్తులకు మోక్షం దక్కనుంది. 3 నెలల్లో రాష్ట్రంలోని 25.70 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిలు ఆదేశించారు. నిబంధనలకు లోబడే ఎల్​ఆర్​ఎస్‌ ప్రక్రియ చేయాలన్న మంత్రి, నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలు, అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

Revenue Minister Ponguleti Srinivas Reddy On LRS Regulation
Revenue Minister Ponguleti Srinivas Reddy On LRS Regulation (ETV Bharat)

Revenue Minister Ponguleti Srinivas Reddy On LRS Regulation : తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు ఎల్​ఆర్​ఎస్‌ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్​మెంట్​ అథారిటీ పరిధిలో 1.35 లక్షల లెక్కన ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటికి సంబంధించిన దరఖాస్తులు నాటి నుంచి నేటి వరకు పరిష్కారం కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్​ఆర్​ఎస్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు గత కొంతకాలంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇవాళ భూపాలపల్లి పర్యటనలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అక్కడి కలెక్టరేట్‌ నుంచి, ఖమ్మం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడి కలెక్టరేట్‌ నుంచి నాలుగేళ్లుగా పెండింగ్ ఉన్న ఎల్​ఆర్​ఎస్ (లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఇరువురు నేతలు, ఎల్​ఆర్​ఎస్‌ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని అదేశించారు. నిబంధనలకు లోబడి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని అమాత్యులు సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి ఉందని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా క్రమబద్ధీకరణ కోసం వేచి చూస్తున్నందున ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. క్రమబద్ధీకరణలో అక్రమాలకు, అవకతవకలకు తావులేకుండా, ఎల్​ఆర్​ఎస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న మంత్రి, దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్​పై తీసుకోవాలని సూచించారు. ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.

ఎట్టకేలకు ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం - ఈ వారం నుంచే దరఖాస్తుల పరిశీలన - 3 నెలల్లో క్రమబద్ధీకరణ - Telangana Govt Focus ON LRS

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయుల ఉద్యోగులకు ముందుగా శిక్షణ ఇవ్వాలన్నారు. ఎల్ఆర్ఎస్ విధివిధానాలను విడుదల చేసినందున అమలుకు అవసరమైన కార్యాచరణను చేపట్టాలని, జిల్లా కలెక్టర్‌లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నందున లే అవుట్​ల క్రమబద్ధీకరణలో ఆయా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించినట్లవుతుందని భట్టి, పొంగులేటిలు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆస్తులకు చట్టపరమైన గుర్తింపు రావడంతో పాటు నిర్మాణాలకు అనుమతి తీసుకునేందుకు, బ్యాంకు రుణాలు తీసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలు తొలిగిపోతాయని, క్రయ విక్రయాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయండి : భట్టి

ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన 'ఎల్ఆర్ఎస్' - ఆ చిక్కులను దాటుకుని ముందడుగు వేసేదెలా? - Telangana Govt On LRS Applications

Last Updated : Aug 3, 2024, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.