Revathi Husbund Bhaskar on AlluArjun Arrest : సంధ్యా థియేటర్ వద్ద పుష్ప-2 రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆరోజు చనిపోయిన రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఆరోజు జరిగిన ఘటనతో అల్లు అర్జున్‌కు ఏమాత్రం సంబంధం లేదనన్నారు. తన భార్య మృతిపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపారు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
‘నా కుమారుడు ‘పుష్ప 2’ సినిమా చూస్తానంటే సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లా. ఇందులో అల్లు అర్జున్ తప్పేం లేదు. ఆయన్ను అరెస్టు చేయనున్నట్టు పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రిలో ఉన్న నేను ఫోన్‌లో అరెస్టు వార్త చూశా. కేసు విత్‌డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.’- భాస్కర్, చనిపోయిన రేవతి భర్త