Revanth Reddy Warning On Power Cuts : విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, కరెంట్ దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సరైన కారణంగా లేకుండా కరెంటు కట్ చేస్తే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. విద్యుత్తు కోతలు(Power Cuts) విధించాలని ప్రభుత్వం చెప్పలేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
CM Revanth Reddy Strong Warning on Power Cuts : గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కట్ చేస్తున్నారన్న సమచారం ఉందని సీఎం తెలిపారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు విధిస్తున్నారని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత విద్యుత్త అధికారులదేనని రేవంత్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే గత రెండు నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ(Transco) వివరించారు.
గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలు ఈనెల 27 లేదా 29న ప్రారంభం
ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల పరిధిలో లోడ్ హెచ్చుతగ్గులను గమనించక పోవడం వల్ల కొంత సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరమ్మతుల వల్ల విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అయిదు నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే కారణాలను సమీక్షించుకోవాలని చెప్పారు.
వేసవిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశమిచ్చారు. తాగునీటి కోసం నాగార్జున సాగర్ నుంచి ఏపీ 9 టీఎంసీలకు పైగా తీసుకుంటుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. తాగు నీటిని ఏపీలో ఎక్కడ వాడుతున్నారో వివరాలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. తాగునీటి పేరుతో ఇతర అవసరాలకు తీసుకెళ్లకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. సమగ్రంగా సమీక్షించి కేఆర్ఎంబీకి లేఖ రాయాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో తాగు నీటికి సమస్య లేకుండా చూడాలని నీటి అవసరాలపై సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో నలుగురు అధికారుల అరెస్ట్
మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం : కిషన్‌రెడ్డి