ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీలో పడవల తొలగింపు ప్రక్రియ వేగవంతం - ముక్కలుగా కోసి తొలగించాలని నిర్ణయం - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE

Boats Removal Process At Prakasam Barrage : ఏపీలోని ప్రకాశం బ్యారేజ్​ వద్ద విధ్వంసం సృష్టించి అక్కడే చిక్కుకుని ఉన్న పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో ఎత్తి తీయడం సాధ్యపడక పోవడం వల్ల వాటిని ముక్కలు చేయాలని అధికారుల నిర్ణయించారు.

BOAT REMOVAL PROCESS At Prakasam Barrage
BOAT REMOVAL PROCESS At Prakasam Barrage (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 5:37 PM IST

Removal Of Boats Begins At Prakasam Barrage : ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం బ్యారేజ్‌ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ రెండోరోజూ కొనసాగుతోంది. పడవలు చిక్కుకుని కదలకపోవడంతో వాటిని ముక్కలు చేయాలని నిర్ణయించారు. పడవలను తొలగించేందుకు విశాఖ నుంచి 10 మంది సభ్యులతో కూడిన స్కూబా డైవింగ్ టీమ్ ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చింది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను రెండు ముక్కలుగా చేయనున్నారు. ఆధునిక పరికరాలతో నదిలోకి వెళ్లి పడవలను ముక్కలుగా కోస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని స్కూబా డైవింగ్ చేస్తూ బోట్లను కోస్తున్నారు. పడవలు తొలగించేందుకు 3 రోజుల సమయం పడుతుందంటున్నారు.

భారీ క్రేన్లతో పడవలను తొలగించే ప్రయత్నం విఫలం : మంగళవారం భారీ క్రేన్లతో పడవలను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువున్న 3 భారీ పడవలు సహా ఓ మోస్తరు బరువు ఉన్నమరో పడవ కలిపి మొత్తం4 చిక్కుకుని కదలక పోవడంతో పడవలను ముక్కలుగా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీంలను అక్కడికి రప్పించారు.

స్కూబా డైవింగ్​ టీంతో పడవకోసే పనులు : ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న విశాఖ నుంచి వచ్చిన పదిమంది సభ్యుల డైవింగ్ టీం వెంటనే రంగంలోకి దిగారు. ఆధునిక పరికరాలతో నది లోపలికి వెళ్లి భారీ పడవలను రెండు ముక్కలుగా కోసే పని ప్రారంభించారు. గతంలో పులిచింతల వద్ద గేటు కొట్టుకుపోయినపుడూ అలాగే పలు చోట్ల ఈ తరహా పనులు సమర్థంగా చేసిన అనుభవం ఉన్న సీ లయన్ అనే సంస్థకు చెందిన డైవింగ్ టీం యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నారు.

'ఆక్సిజన్ సిలిండర్లు వీపునకు తగిలించుకుని వేసుకుని స్కూబా డైవింగ్ చేస్తూ నది లోపల 12అడుగులు లోతుకు వెళ్లిన సభ్యులు కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోస్తారు. ఒక్కోసారి ఇద్దరు చొప్పన వెళ్లి గంట పాటు కటింగ్ చేనున్నారు. వంతుల వారీగా పది మంది సభ్యులు నదిలో నీటిలోకి వెళ్లి నీటిలోనే బోట్లను కోయనున్నారు. సాయంత్రానికి ఒక పడవను తొలగించే అవకాశం ఉంది.' - డైవింగ్ టీం సూపర్ వైజర్

రెస్క్యూ పనులను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల : ప్రకాశం బ్యారేజ్​ వద్ద రెస్క్యూ పనులను ఆంధ్రప్రదేశ్​ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వేగంగా పడవలను తొలగించాలని ఇంజినీర్లు, అధికారులను ఆదేశించారు. రోజుకు ఒక బోటు చొప్పున కనీసం 3 రోజుల పాటు పడవలను కోసే పనులు జరపాల్సి ఉంటుందని ఇంజినీర్లు, సూపర్ వైజర్లు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీలో పడవల తొలగింపునకు ఎయిర్‌ బెలూన్లు - ప్లాన్​ 'బీ' సక్సెస్​ అయ్యేనా ! - Removing Boats in Prakasam Barrage

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన - ఇద్దరు నిందితుల అరెస్ట్ - PRAKASAM BARRAGE BOATS CASE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.