Rehearsals for Independence Day Celebration In Vijayawada Indira Gandhi Municipal Stadium : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 15న జరగనున్న రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందస్తుగా డ్రెస్ రిహార్సల్స్‌ను నిర్వహించారు. అధికారులు 78వ స్వాతంత్య్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. త్రివర్ణ శోభిత వేడుకలకు సంబంధించి శాంతి భద్రతల ఐజీపీ సీహెచ్ శ్రీకాంత్ నోడల్ అధికారిగా, ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు పోలీస్ సమన్వయ అధికారిగా, ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం.బాలసుబ్రమణ్యం రాష్ట్ర సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
78th Independence Day Celebration Arrangements : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కవాతులో తెలంగాణ రాష్ట్ర పోలీస్, కర్నూలు, కడప, కాకినాడ, విశాఖ ఏపీఎస్‌పీ బెటాలియన్ పోలీసులు, ఎన్‌సీసీ బాలబాలికలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ సైనిక‌్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ బృందాలు పాల్గొననున్నాయి. బ్రాస్‌బ్యాండ్స్ విభాగంలో కర్నూలు, కాకినాడ, విజయనగరం, మంగళగిరి, వెంకటగిరి, కడప, అనంతపురం, విశాఖపట్నం ఏపీఎస్‌పీ బెటాలియన్లతో పాటు మంగళగిరి ఏపీఎస్‌పీ బెటాలియన్స్ పైప్‌బ్యాండ్, ఎస్ఏఆర్ సీపీఎల్ హైదరాబాద్ యూనిట్ బ్రాస్, పైప్ బ్యాండ్స్ బృందాలు పాల్గొననున్నాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టరు గుమ్మళ్ల సృజన తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా రిహార్సల్స్ పూర్తి కావడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.ప్రతీ ఏటా రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర (Independence Day) వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా కార్యాలయాలు, పాఠశాలలు, కాళాశాలల్లో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్బంగా పలు సంస్ధల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
క్విట్ ఇండియా ఉద్యమం - చరిత్రకెక్కిన తెనాలి - RANARANGA CHOWK IN TENALI