ETV Bharat / state

రోడ్డు పక్కన కనిపించే ఈ పండు ఎంతో పవర్​ ఫుల్​! - మోకాళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్​ దాకా అన్నిటినీ ఖతం చేస్తుంది! - red lychee fruit health benefits

author img

By ETV Bharat Health Team

Published : Aug 21, 2024, 5:23 PM IST

Updated : Aug 21, 2024, 7:11 PM IST

Lychee Fruit Benefits : రోడ్డు పక్కన బండ్లపై పెట్టి చాలా పండ్లు అమ్ముతుంటారు. అందులో ఎర్రగా కనిపించే లిచీ పండ్లు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చాలా మందికి తెలియదు.మోకాళ్ల నొప్పుల నుంచి.. ఏకంగా బ్రెస్ట్ క్యాన్సర్​ దాకా అన్నింటికీ చెక్ పెడుతుందని నిపుణులు అంటున్నారు.

Lychee Fruit Benefits
Lychee Fruit Benefits (ETV BHARAT Health Team)

Lychee Fruit Benefits : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మోకాళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. అంతేనా.. వయసులో ఉండగానే.. కీళ్లు, ఎముకల నొప్పుల బాధలు వేధిస్తున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక రోగాలన్నింటిని.. రోడ్డుపక్కన ఉండే పండు ఒకే ఒక్క పండు తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు! మరి.. ఆ పండు ఏది? దానివల్ల ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

పండు చిన్నదే ప్రయోజనాలు అనేకం - ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు - CARISSA CARANDAS

  • లిచీ పండ్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు రొమ్ము క్యాన్సర్‌ బారినపడకుండా సహకరిస్తుంది.
  • విటమిన్‌-బి6, విటమిన్‌-సి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, ఫాస్సరస్, ఫైబర్‌ అధికంగా ఉంటాయి.
  • లిచీ పండ్లు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా సాగేలా ఉపయోగపడతాయి.
  • విటమిన్‌-సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అతిసార, కలరా, టైఫాయిడ్‌ లాంటి అంటువ్యాధుల బారినపడకుండా సంరక్షిస్తుంది.
  • రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
  • ఎముక దృఢత్వానికి దోహదపడే మెగ్నీషియం, ఫాస్పరస్‌ ఈ పండ్లలో లభిస్తాయి. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు పెళుసు బారకుండా, మోకాళ్ల నొప్పులూ, కాళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడకుండా మేలు చేస్తాయి.
  • ఇనుము, కాపర్‌ ఖనిజాలు ఉండటం వల్ల ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
  • లిచీ పండ్లు పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయి. హై బీపీతో బాధపడే వారు లిచీ పండ్లను తినడం మంచిదే. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

షుగర్ బాధితులు పాలు తాగొచ్చా? - పరిశోధనలో కీలక విషయాలు! - Can Diabetics Drink Milk

  • పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించడంతో పాటు మధుమేహులకు ఇవి వరం అని చెప్పుకోవచ్చు.
  • వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా వాటి వృద్ధినీ అడ్డుకునే లక్షణాలు లిచీ పండ్ల ప్రత్యేకం.
  • ముఖం, శరీరం మీద ముడతలు రాకుండా వృద్ధాప్యాన్ని వాయిదా వేసుకునేలా లిచీ పండ్లు ఉపయోగపడతాయి.
  • ఉబ్బసం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు, అధిక బరువుతో బాధపడే వారికి లిచీ మంచిదే.
  • లిచీలో అధికంగా ఉండే పాలిపినాల్స్ గుండెను ఆరోగ్యం ఉంచడంతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయి.
  • తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరచడంతో పాటు శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌లను నాశనం చేస్తుంది.
  • లిచీ పండ్లు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌ సమస్యను అడ్డుకోవచ్చు. విటమిన్-C ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.

అధికంగా వద్దు..

మంచిదైనప్పటికీ.. ఏదైనా అతిగా తీసుకోవద్దని మనకు తెలిసిందే. లిచీ పండ్లను కూడా మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే.. లిచీ పండ్లలోని రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గ్యాస్ట్రిక్​ ప్రాబ్లమ్​ తగ్గాలంటే వెళ్లాల్సింది ఆసుపత్రికి కాదు - ఈ అలవాట్లు మార్చుకోవాలి! - How to Get Rid of Gastric Problem

Last Updated : Aug 21, 2024, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.