CCB Raids Rave party in Electronic City Farmhouse : కర్ణాటకలోని బెంగళూరు శివారులో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన రేవ్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. సీసీబీ పోలీసుల బృందం దాడి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నారని నిర్ధారించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telugu Celebrities Caught in Bengaluru Rave Party : హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన బర్త్‌డే పార్టీని బెంగళూరు శివారులోని ఓ వ్యాపారికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ యాంటీ నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్లు నిర్ధారించారు.
ఈ క్రమంలోనే 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే స్టిక్కర్‌ను గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
తనకు ఎలాంటి సంబంధం లేదు : మరోవైపు ఈ పార్టీలో తెలుగు సినీనటి హేమ కూడా పాల్గొన్నారనే వదంతులు వినిపించాయి. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తాను ఎక్కడకు వెళ్లలేదని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఇక్కడ ఫామ్‌హౌస్‌లోనే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. తనపై వస్తోన్న వార్తలను నమ్మవద్దని, అవి ఫేక్ న్యూస్ అని పేర్కొన్నారు. అక్కడ ఎవరు ఉన్నారో తనకు తెలియదని వివరించారు. దయచేసి మీడియాలో తనపై వచ్చే వార్తలను నమ్మకండని హేమ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ శివారు రిసార్ట్‌పై పోలీసుల దాడి, యువకుల నుంచి గంజాయి లభ్యం..