ETV Bharat / state

బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి - తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు గుర్తింపు - CCB Raids Rave party

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 11:11 AM IST

Police Raids on Rave Party in Bengaluru : బెంగళూరులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో ఏపీ, బెంగళూరుకు చెందిన వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Police Raids on Rave Party
Police Raids on Rave Party (ETV Bharat)

CCB Raids Rave party in Electronic City Farmhouse : కర్ణాటకలోని బెంగళూరు శివారులో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన రేవ్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. సీసీబీ పోలీసుల బృందం దాడి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నారని నిర్ధారించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాదాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో సినీ నిర్మాత వెంకట్​

Telugu Celebrities Caught in Bengaluru Rave Party : హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన బర్త్‌డే పార్టీని బెంగళూరు శివారులోని ఓ వ్యాపారికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ యాంటీ నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్లు నిర్ధారించారు.

ఈ క్రమంలోనే 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్‌, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌ను గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కావలిలో డ్రగ్స్​ ముఠా అరెస్ట్​, అంతా డిగ్రీ, ఇంజనీరింగ్​ విద్యార్థులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.