ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు అలర్ట్​ - రేషన్‌కార్డు కేవైసీ అప్డేట్​కు గడువు సమీపిస్తోంది - ration card E KYC Update last date

Ration Card E KYC Last Date : బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈకేవైసీ అప్​డేట్​ ప్రక్రియ ముగింపు గడువు సమీపిస్తోంది. ఈనెల 31వ తేదీన గడువు ముగియనుండటంతో రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

Ration Card EKYC Update
Ration Card E KYC Last Date
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 6:16 PM IST

Ration Card E KYC Last Date : బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన రేషన్​కార్డు ఈకేవైసీ ప్రక్రియకు గడువు ముగియనుంది. ఈ నెల 31వరకు గడువు ఉండగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మినహా హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో ప్రక్రియ మాత్రం మెల్లగా సాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి 20-30శాతం మేర కార్డు దారులు ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారులు తెలిపారు. మరణించినవారి పేర్లు, వివాహాలు చేసుకొని వెళ్లిపోయిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యం కోటాను తీసుకుంటున్నవారు ఉంటున్నారు.

ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వివరాలు అప్​డేట్​​ కొరకు గతేడాది సెప్టెంబరులో ఈ ప్రక్రియను ప్రారంభించింది. లబ్ధిదారుల వివరాలతో పాటు వేలిముద్రలను మరోసారి సేకరిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు అక్కడి చౌకధరల దుకాణానికి వెళ్లి ప్రక్రియ పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించినట్టు అధికారులు చెప్పారు.

రేషన్ కార్డు కావాలా? - కేవైసీ చేయకపోతే ఏం జరుగుతుంది?

బోగస్​ రేషన్​ డీలర్లకు చెక్​: ఈకేవైసీతో పాటు బోగస్​ రేషన్​ డీలర్లకు సంబంధించిన తనిఖీలు జరుగుతున్నాయని హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరిని గుర్తించినట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ నమోదు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. గడిచిన రెండు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇప్పటికి చాలా చోట్ల రేషన్​కార్డుల ఈ-కేవైసీ అప్​డేట్​​ చేయాల్సింది ఉందని సమాచారం. గడువు ఉంది కదా అని కొందరు లైట్ తీసుకుంటుండగా ఆధార్ అప్​డేట్​ సమస్యలతో చాలా మంది ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోతున్నారని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో రేషన్‌ తీసుకోని వారు అంతమంది ఉన్నారా - మరి వారి పరిస్థితి ఏంటి?

రేషన్ కేంద్రాల్లో చాలా మంది ఈ-కేవైసీ పూర్తికావడం లేదు. దీనికి రేషన్​కార్డు దారులు ఆధార్ అప్​డేట్​ చేసుకోకపోవడమే కారణమని డీలర్లు చెబుతున్నారు. దీంతో జనాలు ఆధార్ కేంద్రాలకు అప్​డేట్​ కోసం పరుగులు తీస్తున్నారు. అయితే ఆధార్ సెంటర్స్ తగినన్ని లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి కేంద్రాల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఇటు రేషన్ కేంద్రాల చుట్టూ అటు ఆధార్ సెంటర్స్ చుట్టూ అప్​డేట్​ కోసం​ తిరుగుతున్నారు.

అలర్ట్​ - రేషన్​ కార్డుల KYC లాస్ట్​డేట్​ వచ్చేసింది!

How Many Types of Ration Cards in India : మీరు ఏ రకమైన రేషన్ కార్డు కలిగి ఉన్నారో.. వాటి లాభాలేంటో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.