ETV Bharat / state

దివంగత రామోజీరావుకు గ్రూపు సంస్థల ఉద్యోగుల నివాళి - ఈనాడు యూనిట్‌ కార్యాలయాల్లో పుష్పాంజలి - Tribute to Ramoji Rao - TRIBUTE TO RAMOJI RAO

Tribute to Ramoji Rao : అక్షరయోధుడు, దివంగత రామోజీరావుకు రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ సహా జిల్లాలోని ఈనాడు-ఈటీవీ యూనిట్‌ కార్యాలయాల్లో రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఛైర్మన్‌తో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్న ఉద్యోగులు ఆయన అప్పగించిన బాధ్యతలు కొనసాగిస్తామని వెల్లడించారు. రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వివరించారు.

Ramoji Group Employees Pay Tribute To Ramoji Rao
Ramoji Group Employees Pay Tribute To Ramoji Rao (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 10:25 PM IST

దివంగత రామోజీరావుకు గ్రూపు సంస్థల ఉద్యోగుల నివాళి - ఈనాడు యూనిట్‌ కార్యాలయాల్లో రామోజీకు పుష్పాంజలి (ETV Bharat)

Ramoji Group Employees Pay Tribute To Ramoji Rao : నిత్యకృషీవలుడు, రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఆయన సంస్థల ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఈనాడు అడ్వర్టైజ్‌మెంట్ విభాగం హెడ్ ఐ.వెంకట్, ఈనాడు, ఈటీవీ పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, ప్రియా ఉద్యోగులు, తదితర విభాగాల సిబ్బంది అక్షరయోధుడి శ్రద్ధాంజలి ఘటించారు.

అక్షరయోధునికి ఉద్యోగుల ఘన నివాళి : అక్షరంతో నడిచి, అక్షరంతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపారని కొనియాడారు. సంస్థ నిర్ధేశించిన బాధ్యతలు తప్పకుండా నిర్వర్తించడం ద్వారా రామోజీరావు ఆశయాలు ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు. మార్గదర్శి కార్యాలయంలోనూ నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాల ఈనాడు కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పాత్రికేయులు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్‌లో కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల నుంచి వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు పువ్వులతో నివాళులర్పించారు.

union Minister sanjay Tributes To Ramoji : కరీంనగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీరావుకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న సంజయ్‌ రామోజీరావుతో తనది గురుశిష్యుల బంధమని వెల్లడించారు. క్రమశిక్షణకు మారుపేరైన రామోజీరావు ఆశయాలను ఆయన ఉద్యోగులు ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉందని వెల్లడించారు.

హనుమకొండలో అక్షరయోధునికి నివాళి : అక్షరయోధుడు రామోజీరావుకు హనుమకొండ జిల్లా మడికొండలోని ఈనాడు కార్యాలయంలో ఉద్యోగులు అక్షరాంజలి ఘటించారు. ఖమ్మం యూనిట్‌లో రెండు నిమిషాలు మౌనం పాటించిన ఉద్యోగులు ఆయన కార్యదక్షత, పత్రికా రంగంలో ఈనాడును ఉన్నత స్థితిలో ఉంచిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. రామోజీరావు మార్గం అనితర సాధ్యం, ఆదర్శప్రాయమని మహబూబ్‌నగర్‌ యూనిట్‌ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

ఈనాడు పత్రికలో ఎన్నో అద్భుతమైన కథనాలు రాసేందుకు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది ఆయనేనని తెలిపారు. నల్గొండలో ఘన నివాళులర్పించిన ఉద్యోగులు ఆయన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని స్పష్టం చేశారు.

'కంట్రిబ్యూటర్ సలహాలను సైతం స్వీకరించే గొప్ప వ్యక్తి రామోజీరావు'

అక్షరయోధుడు రామోజీరావుకు ఉద్యోగుల నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.