ETV Bharat / state

పోలింగ్ వేళ ముంచుకొస్తున్న వర్షం- రాజకీయ నాయకుల్లో టెన్షన్! - Rain Effect to AP Elections 2024 - RAIN EFFECT TO AP ELECTIONS 2024

Rain Effect to AP Elections 2024: రాష్ట్రంలో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న వేళ వాతావరణశాఖ రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు గుబులుపట్టుకుంది. పోలింగ్ వేళ వర్షంపడినా, ఎండలు దంచికొట్టినా ఓటింగ్ మీద ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

Rain_Effect_to_AP_Elections_2024
Rain_Effect_to_AP_Elections_2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 8:18 AM IST

Rain Effect to AP Elections 2024: ఇవాళ రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి వర్షం కురుస్తుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేవారు స్థానిక వాతావరణాన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ సూచించారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచనలు జారీ చేసింది.

అకాల వర్షంతో రాష్ట్రంలో అల్లకల్లోలం - వందల ఎకరాల్లో దెబ్బతిన్న పసుపు, మొక్కజొన్న పంటలు - Unseasonal Rains in AP

కాగా రాష్ట్రంలో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. పోలింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ వేళ రాజకీయ నాయకులకు వర్షం గండం పట్టుకుంది. పోలింగ్ సమయంలో వర్షం కురిస్తే ఓటింగ్ మీద ప్రభావం పడుతుందనే వాదన వ్యక్తమవుతోంది.

తీవ్రమైన ఎండలుంటే పోలింగ్ ప్రక్రియపై ప్రభావం పడనుంది. మండుటెండలో ఓటేసేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపరని అందరూ భావిస్తుంటే ఇప్పుడు వర్షం పడనుందని చెప్తున్నారు. ఒకవేళ వర్షం కురిసినా వానల్లో తడుస్తూ ఓటేసేందుకు అంతగా ఆసక్తిచూపించరని వర్షం కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపించనుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో పోలింగ్ వేళ భానుడు వస్తాడో? వరుణుడు వస్తాడో? అని రాజకీయ నేతల్లో గుబులుపట్టుకుంది.

పల్నాడు జిల్లాలో పిడుగుపాటు- ఇద్దరు గొర్రెల కాపరులు మృతి - Two Die lightning Strikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.